అదో చెత్త కాన్సెప్ట్.. `ఐరన్‌ లెగ్‌, గోల్డెన్‌ లెగ్` కామెంట్లపై సంయుక్త మీనన్‌ ఘాటు వ్యాఖ్యలు.. వైరల్‌

Published : Apr 21, 2023, 03:57 PM IST

హీరోయిన్లని `ఐరన్‌ లెగ్‌`, `గోల్డెన్‌ లెగ్‌` అని పిలవడంపై హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ రియాక్ట్ అయ్యింది. ఆమె దీనికి ఘాటు సమాధానం చెప్పింది. చెత్త కాన్సెప్ట్ అంటూ ఆమె వ్యాఖ్యానించడం విశేషం.

PREV
15
అదో చెత్త కాన్సెప్ట్..  `ఐరన్‌ లెగ్‌, గోల్డెన్‌ లెగ్` కామెంట్లపై సంయుక్త మీనన్‌ ఘాటు వ్యాఖ్యలు.. వైరల్‌

ఒక హీరోయిన్‌ నటించిన సినిమాలు వరుసగా హిట్‌ అయితే ఆమెది `గోల్డెన్‌ లెగ్‌` అని, ఫ్లాప్‌ అయితే `ఐరన్‌ లెగ్‌` అనే సెంటిమెంట్‌ని యాడ్‌ చేస్తూ చిత్ర పరిశ్రమలో పిలవడం చాలా కాలంగా వినిపిస్తున్న మాట. తరచూ ఇది చర్చనీయాంశంగానూ మారుతుంది. ప్రధానంగా హీరోయిన్ల విషయంలోనే ఇది వినిపిస్తుంది. ఏ హీరోకిగానీ, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల విషయంలోనూ ఇది జరగదు. కేవలం `ఐరన్‌ లెగ్‌`, `గోల్డెన్‌ లెగ్‌` అనేది హీరోయిన్లకే పరిమితమయ్యింది. 
 

25

ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రశ్న సంయుక్త మీనన్‌కి ఎదురైంది. ఆమె `భీమ్లా నాయక్‌`, `బింబిసార`, `సార్‌` సినిమాలతో విజయాలు అందుకుంది. అయితే ఇవి ఓ మోస్తారు విజయాలనే సాధించాయి. ఇప్పుడు ఈ బ్యూటీ `విరూపాక్ష` చిత్రంతో వచ్చారు. ఈ సినిమా నేడు విడుదలయ్యింది. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమెకి `గోల్డెన్‌ లెగ్‌`, `ఐరన్‌ లెగ్‌` అనే ప్రశ్న ఎదురయ్యింది. ఈ సెంటిమెంట్‌పై ఆమె స్పందిస్తూ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. అసలు ఈ కాన్సెప్టే చాలా బ్యాడ్‌ కన్సెప్ట్ అంటూ కొట్టిపారేశాడు. సినిమా సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి అందరూ బాధ్యులే అని వెల్లడించారు. ఇది చాలా ఓల్డ్ కాన్సెప్ట్ అని కొట్టిపారేశారు. 

35

``గోల్డెన్‌ లెగ్‌, ఐరన్‌ లెగ్‌` అనేది చాలా చెత్త(బ్యాడ్‌) కాన్సెప్ట్. దాన్ని నేను అస్సలు అంగీకరించను. ఎందుకంటే మీరు సినిమాకి తక్కువ ఎఫర్ట్స్ పెట్టి, సినిమా సక్సెస్ అయ్యిందంటే అది లక్కీ. హీరోయిన్‌ మంచి స్క్రిప్ట్ లు సెలక్ట్ చేసుకుని, బాగా నటించి, మంచి ఎఫర్ట్స్ పెట్టినప్పుడు వచ్చే సక్సెస్‌, అసలైన సక్సెస్. అదొక ఓల్డ్ ఏజ్‌ కాన్సెప్ట్. దాన్ని దూరం పెట్టండి. అందులోకి హీరోయిన్‌ని లాగకండి. ఒక సినిమాకి కాస్టింగ్‌ అనేది ఆయా పాత్రకి, ఆమె న్యాయం చేస్తుందా? ఆ పాత్రని మోయగలదా? అనేదాన్ని బట్టి ఎంపిక ఉంటుంది. అదే తాన నమ్ముతాను` అని పేర్కొంది సంయుక్త మీనన్‌. 
 

45

`విరూపాక్ష`లో ఆమె నందిని పాత్రలో నటించింది. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌కి లవ్‌ ఇంట్రెస్ట్ గా కనిపిస్తుంది. కానీ చివర్లో తనే ఘోస్ట్ గా మారి షాకిస్తుంది. ఆమె పాత్ర చిత్రీణ బాగుంది. థ్రిల్లింగ్‌తోపాటు ఆకట్టుకునేలా ఉంటుంది. అయితే సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ పాత్ర కంటే సంయుక్త మీనన్‌ పాత్రనే బలంగా కనిపించడం విశేషం. ఇక రొటీన్‌ హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన `విరూపాక్ష`కి మిశ్రమ స్పందన లభిస్తుంది. స్లోగా సాగడం, బోరింగ్‌ లవ్‌ స్టోరీ, ఫేలవమైన క్లైమాక్స్‌, అనేక లాజిక్స్ మిస్‌ కావడం వంటివి సినిమాకి మైనస్‌గా మారాయి. 
 

55

ఇక సంయుక్త మీనన్‌ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు సినిమాలతో హిట్లు అందుకున్న ఈ భామ టాలీవుడ్‌లో హాట్‌ కేక్‌ అయ్యింది. ఇప్పుడు `విరూపాక్ష` కూడా హిట్‌ అయితే క్రేజీ హీరోయిన్‌గా మారిపోతుంది.  ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో కళ్యాణ్‌ రామ్‌తో `డెవిల్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ బ్యూటీకి కొత్తగా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయని, అయితే అవి చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories