'ఏజెంట్' అవుట్ పుట్ విషయంలో నాగార్జున హ్యాపీయేనా ?

Published : Apr 21, 2023, 03:04 PM IST

ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

PREV
16
'ఏజెంట్' అవుట్ పుట్ విషయంలో నాగార్జున హ్యాపీయేనా ?

నాగార్జున తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ ఎవరికీ సొంతం కాలేదు. నాగ చైతన్య తన కంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నప్పటికీ స్టార్ డమ్ కి అడుగు దూరంలోనే ఉంటూ వచ్చాడు. అఖిల్ ని నాగార్జున తొలి చిత్రం నుంచే బాగా ప్రమోట్ చేస్తూ వచ్చాడు. 

26

కానీ అక్కినేని ఫ్యాన్స్ కోరుకునే విధంగా అఖిల్ కి సరైన విజయం దక్కడం లేదు. అఖిల్ కమర్షియల్ యాక్షన్ మూవీస్, ప్రేమ కథా చిత్రాలు చేశాడు. కానీ ఏవీ వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

36

ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్ స్టంట్స్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి ఈ చిత్రంలో ప్రధానంగా యాక్షన్ అంశాలపై దృష్టిపెట్టినట్లు అర్థం అవుతోంది. ప్రస్తుతం స్పై థ్రిల్లర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఇది ఏజెంట్ చిత్రానికి కలసి వచ్చే అంశం. 

46

అయితే ట్రైలర్ గతంలో వచ్చిన స్పై చిత్రాల్ని గుర్తు చేసే విధంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఓవరాల్ గా ఏజెంట్ మూవీపై మంచి బజ్ ఉంది. తన కొడుకుని టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా చూడాలని ఆశపడుతున్న నాగార్జున.. ఏజెంట్ విషయంలో సంతృప్తిగా ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. 

56

ప్రస్తుతం ఏజెంట్ ఫైనల్ ప్రింట్ రెడీ అవుతున్నట్లు సమాచారం. దీని కోసం ఎడిటింగ్ లో నాగార్జున ఇన్వాల్వ్ అవుతున్నట్లు టాక్ వస్తోంది. రషెష్ ఆయన చూశారట. కాస్త అటు ఇటుగా ఉన్న సన్నివేశాలని తొలగించమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగ్ అయితే ఏజెంట్ అవుట్ పుట్ పై సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

66

అయితే ఆడియన్స్ అఖిల్ ని ఇంత వైల్డ్ క్యారెక్టర్ లో ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కాస్త టెన్షన్ ఫీల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ముందుగా నాగార్జుననే అనుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సురేందర్ రెడ్డి వద్దని చెప్పారట. అఖిల్ కి జోడిగా ఈ చిత్రంలో సాక్షి వైద్య నటిస్తోంది. 

click me!

Recommended Stories