యంగ్ అండ్ బ్యూటీఫుల్ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. కొన్నాళ్ల పాటు తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ సక్సెస్ ను మాత్రం చూడలేకపోయింది. దీంతో ఇతర ఇండస్ట్రీల్లో లక్ ను పరీక్షించుకుంటోంది.
మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన ఈషా రెబ్బా ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన నటన, గ్లామర్ తో తెలుగు నటిగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ గా ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
బంధిపోటు, అమీ తుమీ, దర్శకుడు, బ్రాండ్ బాబు, సుబ్రహ్మణ్యపురం, రాగల 24 గంటల్లో.... వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలేవీ ఈషా మంచి సక్సెస్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో టాలీవుడ్ లో ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి.
దీంతో ఈషా తమిళ ఇండస్ట్రీలో తన లక్ ను పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఖుషీ చేస్తోంది. మరోవైపు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేసుకుంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
తాజాగా యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా బ్లాక్ మినీ టైట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. అన్ని యాంగిల్లో పరువాలను ప్రదర్శిస్తూ మతులు పోగొట్టింది. యంగ్ బ్యూటీ కిల్లింగ్ పోజులకు కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. దీంతో ఆమె పంచుకున్న వీడియోను లైక్స్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం తమిళం ఇండస్ట్రీలో ‘ఆయిరం జెన్మంగల్’ చిత్రంలో నటిస్తోంది. చివరిగా తమిళ చిత్రం ‘నితమ్ ఒరు వానం’ సినిమాలో స్పెషల్ అపియరెన్స్ తో అలరించింది. అటు వెబ్ సిరీస్ లలోనూ మెరిసింది. నిన్న ఈషా బర్త్ డే సందర్భంగా ‘మామా మశ్చీంద్ర’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.