దీవుల దేశంలో సమంత జల్సాలు... డెనిమ్ షార్ట్స్ ధరించి ఓ రేంజ్ లో ఊపేసింది!

Published : Jul 28, 2023, 01:19 PM IST

సమంత వెకేషన్ లో ఉన్నారు. షూటింగ్స్ ఏమీ లేకపోవడంతో లాంగ్ టూర్ ప్లాన్ చేశారు. బాలీ ద్వీపంలో సమంత డాన్స్ వీడియో వైరల్ అవుతుంది.   

PREV
17
దీవుల దేశంలో సమంత జల్సాలు... డెనిమ్ షార్ట్స్ ధరించి ఓ రేంజ్ లో ఊపేసింది!
Samantha

డెనిమ్ షార్ట్స్ ధరించి సమంత క్రేజీ స్టెప్స్ తో మంట పుట్టింది. కిరాక్ స్టెప్స్ తో ఓ రేంజ్ లో ఊపేసింది. సమంత స్టన్నింగ్ స్టెప్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. సమంత సరదాలు మామూలుగా లేవని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

 

27
Samantha

ప్రస్తుతం సమంత బాలీ ద్వీపంలో ఉన్నారు.. ఇటీవల ఆమె ఇండోనేషియా వెళ్లారు. సమంత తన వెకేషన్ ఫోటోలు, వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుండగా వైరల్ అవుతున్నాయి. ఖాళీ సమయాన్ని సమంత మానసిక ప్రశాంతత కోసం ఉపయోగిస్తున్నారు. అందుకే ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు నచ్చిన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. 
 

37
Samantha


ఫ్రెండ్స్ తో సమంత ట్రిప్ కి వెళ్లారు.  ఈ ట్రిప్ అనంతరం సమంత అమెరికా వెళ్లే సూచనలు కలవు. ఇక అధికారికంగా సమంత ఏ చిత్రానికి సైన్ చేయలేదు. ఆమె ఒక హాలీవుడ్ చిత్రం చేయనున్నారనే ప్రచారం జరుగుతుంది. చెన్నై స్టోరీ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ హాలీవుడ్ మూవీలో వివేక్ కార్లా హీరో కాగా ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తారట. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. 
 

47
Samantha

సమంత ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ పూర్తి చేశారు. గత ఏడాది సమంత ఈ రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ఖుషి షూటింగ్ సమంత అనార్యోగం బారిన పడటంతో ఆగిపోయింది.

57
Samantha

మయోసైటిస్ సోకినట్లు ప్రకటించిన సమంత నెలల పాటు ఇంటికి పరిమితమయ్యారు. కొంతమేర కోలుకున్న సమంత తిరిగి నటించడం స్టార్ట్ చేశారు. మిగిలి ఉన్న ఖుషి చిత్రీకరణ పూర్తి చేశారు. ద్రాక్షారామంలో విజయ్ దేవరకొండ-సమంత మీద పతాక సన్నివేశాలు చిత్రీకరించారు. 

67
Samantha


ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ లో నిరవధికంగా పాల్గొన్న సమంత జులై 13 నాటికి షూటింగ్స్ నుండి బయటపడ్డారు. ఖుషి చిత్రానికి డబ్బింగ్ కూడా చెప్పేసిన  ఫ్రీ అయ్యారు. కాగా ఏడాది పాటు సమంత విరామం తీసుకోనున్నారట. సమంత ఎలాంటి ప్రాజెక్ట్స్ కి సైన్ చేయకూడదని నిర్ణయించుకున్నారట. 


 

77
Samantha

చికిత్స కోసం సమంత అమెరికా  వెళ్లాల్సి ఉండగా గ్యాప్ తీసుకున్నారట. అక్కడే కొన్ని నెలల పాటు ఉంటారట. సమంత మిత్రుడు హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ బత్కర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. పరోక్షంగా నిజమే అని తెలియజేశాడు. సమంతకు ట్రీట్మెంట్ చక్కగా జరగాలంటూ విష్ చేశాడు. 

click me!

Recommended Stories