Bro Movie Review: 'క్లాస్' .....‘బ్రో’ రివ్యూ

First Published | Jul 28, 2023, 12:08 PM IST

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు  సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రం ఈ రోజు  రిలీజ్  అయ్యింది.

BRO Telugu Movie Review


పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ జోష్ వేరు. ఆయన అభిమానుల్లోనే కాకుండా రెగ్యులర్ సినీ గోయర్స్ లో కూడా ఆసక్తి ఉంటుంది.  అయితే తమిళ చిత్రం రీమేక్ కావటం, పవన్ కళ్యాణ్ ఎక్కువ సేపు ఉండడు అనే వార్తలు రావటంతో సినిమాపై మొదట పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. అయితే  ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. పవన్ తన పాత పాటలతో మేజిక్ చేస్తాడా..త్రివిక్రమ్ తన డైలాగులతో మరో జల్సా చేసారా ..తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకుడుగా సినిమాని ఇక్కడ కమర్షియల్ మీటర్ కు అనుగుణంగా తీర్చిదిద్దారా వంటి విషయాలు చూద్దాం.  

స్టోరీ లైన్
 
 చిన్నప్పుడే తండ్రి చనిపోవటంతో మార్క్ అలియాస్ మార్కండేయులు ( సాయి ధర్మ తేజ్ ) ఫ్యామిలీకే అంకితమైపోతాడు.  ఎప్పుడు చూసినా టైం లేదు టైం లేదు అనుకుంటూ టైంతో పోరాడుతూ ఉంటాడు. ఇంటా,బయటా అంటే ఆఫీస్ లోనూ  మంచి పేరు తెచ్చుకుంటాడు. మార్క్ మంచి బాలుడు అనిపించుకుంటాడు. ఆ బిరుదేనా మనిషికి కావాల్సింది. దానికోసమేనా మనిషి నిరంతరం ప్రయత్నిస్తూంటాడు...ఆ విషయంపై మార్క్ కు అతని జీవితంలో టైమ్ (పవన్ కళ్యాణ్) ప్రవేశించాక క్లారిటీ వస్తుంది. మార్క్ కు 'టైమ్' 90 రోజులు లైఫ్ ఎక్సటెన్షన్ ఇస్తాడు. అసలు మార్క్ కు టైమ్ ని కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. టైమ్ ...ఎందుకు గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. ఇవ్వటానికి అతను ఎవరు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎనాలసిస్ 

 రచయిత, దర్శకుడు, నటుడైన సముద్రఖని రూపొందించిన ‘వినోదయ సిత్తం’ సినిమా కరోనా టైమ్‌లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్లలో విడుదల కాకపోయినప్పటికీ.. ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలై మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. టైమ్ ప్రధాన కథాంశంగా రూపొందిన ఈ సినిమా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ కావడంతో దీనిని తెలుగులో  రీమేక్ చేసారు. అయితే ఓటిటి నుంచి పెద్ద తెరకు..అదీ పెద్ద స్టార్ కు ఎడాప్ట్ చేయటం అంటే మామూలు విషయం కాదు..చాలాజాగ్రత్తలు తీసుకోవాలి. 

  వినోద‌య సిత్తం సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్స్‌, పాట‌లు, ఎలివేష‌న్స్ ఏవి క‌నిపించ‌వు. సినిమా మొదట  నుంచి ముగింపు వ‌ర‌కు వాస్త‌విక‌త‌కు ద‌గ్గ‌ర‌గా ఈ సినిమాను న‌డిపించారు డైరెక్ట‌ర్‌. తెర‌పై పాత్ర‌ల్ని కాకుండా నిజ‌మైన జీవితాల్ని చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. నిడివి కూడా రెండు గంట‌ల లోపే ఉండ‌టం ప్ల‌స్ పాయింట్‌గా ఉండి ఓటిటికు ఫెరఫెక్ట్ ఆప్షన్ అయ్యింది. అయితే తెలుగుకు వచ్చేసరికి చాలా మార్పులు చేసారు. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సీన్స్ తిరగ రాసారు... అయితే ఎంత రాసినా, ఏమి చేసినా పవన్ కళ్యాణ్ పాత్ర తెరపై చేయటానికి ఏమీ ఉండదు. కేవలం సాక్షి భూతంగా చూస్తూండిపోతుంది. కాబట్టి ఆ పాత్ర ని ఫాలో అయితే మనకు ఏ ఎమోషన్ కలగదు.


చ‌నిపోయిన వ్య‌క్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జ‌రుగుతుంది అనేదే ఈ క‌థ‌. ముప్పై ఏళ్ల ప్ర‌యాణంలో తాను చూడలేని అస‌లైన జీవితాన్ని ఓ వ్య‌క్తి మూడు నెల‌ల్లో ఎలా ద‌ర్శించాడ‌న్న‌ది ద‌ర్శ‌కుడు  సందేశాత్మ‌కంగా  సినిమాలో చూపించే ప్రయత్నం చేసారు. క‌ళ్ల ముందు క‌నిపించేదే అస‌లైన జీవితం కాద‌ని, మ‌నుషులు, వారి మ‌న‌స్త‌త్వాల్లో మ‌రో కోణం దాగి ఉంటుంద‌ని చాటిచెప్పాలనే ప్రయత్నం కొత్తగా అనిపిస్తుంది. అయితే తమిళ వినోద‌య సిత్తం కు తెలుగు బ్రో కు చూపిన తేడా అక్కడ తంబి రామయ్య పాత్రను కుర్రాడిని చేయటమే. ఎప్పుడైతే అలా చేసారో ప్లేవర్ మారింది. 


అక్కడ కుటుంబ భాధ్యతల్లో మునిగిపోయిన మధ్యతరగతి మనిషి ఇక్కడ కాంటెంపరరీ సొసైటీలో మిడిల్ క్లాస్ బ్రో అయ్యిపోయాడు. అయితే బాగా భాధ్యతగల బ్రోనే. అందుకే ఆ మథన..అందుకు ప్రతిఫలం దేవుడు చేత క్లాసులు చెప్పించుకోవటమూను. అయితే పవన్ కళ్యాణ్ అనే మాయను ప్రక్కన పెట్టి చూస్తే...వాస్త‌వాల‌కు భ్ర‌మ‌ల‌కు మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని తెలుసుకున్న‌ప్పుడే నిజ‌మైన జీవితం విలువ అర్థ‌మ‌వుతుంద‌ని  ఆవిష్క‌రించటం నచ్చుతుంది.అలాగే  త‌ప్పొప్పుల నిర్ణయంలో మ‌నుషుల‌ ఆలోచ‌న‌లు అభిప్రాయాల్ని ఎలా ఉంటాయి? అసలైన జీవితపు విలువ‌ ఏమిటి అనే విషయాలు చాటిచెబుతూ బ్రో సినిమా అర్థ‌వంతంగా సాగినట్లు అర్దమవుతుంది. 
 


ఇది ఓ surficial  ఫిల్మ్ . ఈ సినిమాలో మెసేజ్ ఇంతకు ముందు సినిమాల్లో వచ్చింది కాదు కానీ కొత్తదైతే కాదు.  ఒరిజనల్ వినోద‌య సిత్తం లోని స్క్రీన్ ప్లేని  పవన్ ఇమేజ్ కు తగ్గట్లు చేసిన మార్పులు తప్పించి పెద్దగా చేయకుండానే వాడారు. త్రివిక్రమ్ చతురత డైలాగుల్లో కనిపించింది కానీ ,స్క్రిప్టులో మ్యాజిక్ అయితే క్రియేట్ కాలేదు. ఫస్టాఫ్ అలా అలా వెళ్లిపోయినా...  ముఖ్యంగా సెకండాఫ్ లో కథ అయ్యిపోయి సాగుతున్న ఫీలింగ్ వచ్చింది. కథను మలుపు తిప్పి, మనని ఆశ్చర్యపరిచే సంఘటనలు ఏమీ జరగవు. క్లైమాక్స్ అయితే మరీ నీరసంగా ఉంది. 


మొత్తంగా చూస్తే  దీన్ని పవన్ కళ్యాణ్ రెగ్యులర్ కమర్షియల్ మాస్ సినిమాగా చూస్తే నిరాశకలుగుతుంది. దేవుడిగా కనపడి ఫ్యాన్స్ వింటేజ్ పాటల వరాలు ఇచ్చి వెళ్లిపోతాడు. అంతకు మించి చేయటానికి ఏమీలేదు  పనిలో పనిగా మనకి అవసరమైన పాఠం లాంటి గుణపాఠం నేర్పే ప్రయత్నం చేస్తాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దాటి  ఈ మెసేజ్ మన బుర్రని  చేరుతుందా అనేది అసలైన ప్రశ్న. పొలిటికల్ గా ఒకట్రెండు డైలాగులు పడ్డాయి కానీ అవి ఎక్కువ లాగలేదు..అక్కడితో ఆపారు. అవునూ ఫృధ్వీరాజ్ డాన్స్... అతన్ని నీకెందుకురా డాన్స్ అని క్లాస్ పీకటం...ఓ పొలిటీషన్ డాన్స్ గురించి అయితే కాదు కదా?

Bro Movie Review

టెక్నికల్ గా...

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు స్క్రిప్టు తెలుగు నేటివిటి అంటే కేవలం పవన్ ఇమేజ్ ని కథలోకి తీసుకురావటానికే వర్క్ చేసినట్లు ఉంది. పాటల ప్లేస్ మెంట్ బాగుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు బాగానే ఖర్చు పెట్టారు. ఆ మధ్యన వెంకీ, నాగచైతన్యతో వెంకీ మామ, ఇప్పుడు పవన్, సాయి ధరమ్ తో బ్రో చేసారు. మరో మామ,మేనల్లుడు కోసం వారు వెతకాలి మరి. VFX వర్క్ బాగోలేదని చెప్పలేం. అలాగని అదిరిపోయిందని అనలేం. కెమెరా వర్క్ బాగుంది. పాటలు అంతగొప్పగా లేవు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.  డైలాగుల్లో ఇండైరక్ట్ గా అక్కడక్కడా పొలిటికల్ ప్లేవర్ తగిలింది. కాస్ట్యూమ్స్ మాత్రం ఓ రేంజిలో ఉన్నాయి. ఎడిటింగ్ కూడా ఎక్కడా నసకు తావివ్వకుండా ముందుకు తీసుకెళ్లిపోయింది. సముద్ర ఖని దర్శకుడుగా అటు స్టోరీలో ఉన్న  ఫిలాసఫికి ఓటేయాలా లేక పవన్ ఇమేజ్ కు జై కొట్టాలా అనే డైలమో చివరి దాకా కొనసాగింది. 

Bro Movie Review


ఎవరెలా చేసారు: 

మామ, మేనల్లుడు కలిసి సినిమాని మోసుకుంటూ వెళ్లిపోయారు. మిగతావాళ్లు నామ మాత్రం. బ్రహ్మీ ని ఒక సీన్ కే పరిమితం చేసారు. వెన్నెల కిషోర్, తణికెళ్ల వంటి సీజన్డ్ ఆర్టిస్ట్ ల నుంచి కూడా పెద్దగా ఎక్సపెక్ట్ చేయటం, ఇక హీరోయిన్స్ ఈ సినిమాలో ఇరికించినట్లు ఉంటుంది. అంతకు మించి వాళ్లకు ఏమీ లేదు.

Bro Movie Review


బాగున్నవి: 

యాజ్ యూజవల్ గా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజన్స్
పవన్ హిట్ సాంగ్స్ ని మరోసారి తెరపై చూడటం
ఫన్నీ డైలాగ్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్.
 తక్కువ రన్ టైమ్

Bro Movie Review

బాగోలేనివి :
మాతృకలో హైలెట్ అయిన లైఫ్ ఫిలాసపి ఇక్కడ మరుగున పడటం
స్లో నేరేషన్
ఫ్యాన్స్ కు మాత్రమే అన్నట్లు చాలా సీన్స్ నడపటం
ఎమోషనల్  సీన్స్ వర్కవుట్ కాకపోవటం
 

Bro Movie Review


 
నాకు నచ్చింది


సాయి తేజ్ చనిపోయిన తర్వాత స్వర్గానికి తీసుకెళుతున్నానని దేవుడు(టైమ్) చెబితే.. మరి నరకం అంటే ఏమిటి? అని అడుగుతాడు. నరకం అంటే.. ఒకే ఒక్క మాటతో ఆయన ఇచ్చిన సమాధానం..  ‘ఇప్పుడు అక్కడి నుంచే కదా నిన్ను తీసుకెళుతుంది?’ 

ఫైనల్ థాట్

ఒరిజనల్ కు మార్పులు చేర్పులు అంటే...పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఈ సినిమాలో ఎలా వాడాలి అన్న యాంగిల్ కష్టపడ్డారని అర్దమైంది.  

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5 
 


బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నటీనటులు:పవన్ కళ్యాణ్, సాయి ధరమ్,  కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వీ రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్  తదితరులు
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: సెల్వ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
రచన, దర్శకత్వం: పి. సముద్రఖని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
విడుదల తేదీ:  28,జూలై 2023

Latest Videos

click me!