టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో సమంత పేరు ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న సమంత.. ఏజ్ పెరిగే కొద్ది తన గ్లామర్ ను కూడా పెంచుకుంటూ పోతోంది. నాగచైతన్యతో ప్రేమ.. పెళ్ళి.. విడాకులు.. ఇలా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా.. సింగిల్ హీరోయిన్ గా జీవితాన్నినెట్టుకొస్తోంది. ఏ విషయంలో భయపడకుండా సాగిపోతోంది సమంత.
Samantha
రీసెంట్ గా సినిమాలకు విరాపం ప్రకటించింది సమంత, ఏడాది పాటు సినిమాలు ముట్టుకోకుండా తను ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల నుంచి ముందు దూరంఅవ్వాలి అని ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మయోసైటిస్ తో భాదపడుతున్న ఆమె.. షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి ఖాళీ టైమ్ లో ఎంజాయ్ చేస్తోంది.
ఈమధ్య ఖుషి సినిమాతో సూపర్ హిట్ కొట్టిందిసమంత, అంతకు ముందు వరకూ వరుస ఫెయిల్యూర్స్ చూసిన బ్యూటీ.. విజయ్ దేవరకొండ జోడీగా నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
అయితే సమంత ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది సమంత. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే సమంత ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
Samantha Ruth Prabhu
ఎప్పటిలాగే సోషల్ మీడియాలో సందడి చేసింది సమంత. అయితే ఈసారి మాత్రం బ్లూ కలర్ డీప్ నెక్ డ్రెస్ లో .. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది బ్యూటీ. అయితే ఈ ఫోటోలు వైరల్ అవుతుండగానే.. కొంత మందిని మాత్రం సమంత చేతిలో ఉన్న బ్యాక్ ఆకర్శించింది.
ఈ ఫోటో షూట్ లో.. సమంత చాలా స్టైలిష్ లుక్ లో కనిపించింది. ఇక ఈ ఫోటోలలో సమంత తన చేతిలో ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని కనిపించింది. చాలా మంది దృష్టిని ఈ హ్యాండ్ బ్యాగ్ ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఈ హ్యాండ్ బ్యాగ్ ధర ఎంత ఉంటుందని ఆరా తీయడం మొదలుపెట్టారు. సమంత ఈ హ్యాండ్ బ్యాగ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారని తెలుస్తోంది.
అంతే కాదు ఆ బ్యాగ్ ఖరీదు అక్షరాలా 10 లక్షలు అని సమాచారం. ఓ చిన్న బ్యాక్ కాస్ట్ 10 లక్షలా.. అని అంతా నోరు వెళ్ళబెట్టుకుని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. 10 లక్షలంటే ఓ చిన్న కుటుంబం సెటిల్ అయ్యేంత మనీతో.. ఓ చిన్న బ్యాక్ కొనిందిసమంతా అంటూ.. షాక్ అవుతున్నారు.