ఇన్నిరోజులు తర్వాత పల్లవి ప్రశాంత్ నిజస్వరూపం ఇదిగో, నాగార్జునని కూడా వదిలిపెట్టకుండా..ఏం చేసినా డోంట్ కేర్

Published : Jul 04, 2024, 03:24 PM IST

బిగ్ బాస్ సీజన్ 7 ముగిసి చాలా కాలం అవుతోంది. సీజన్ 8 కి కూడా సన్నాహకాలు మొదలైనట్లు తెలుస్తోంది. కానీ బిగ్ బాస్ 7 లో జరిగిన సంచలనాలు ఇప్పటికీ ఆడియన్స్ మరచిపోలేకున్నారు.

PREV
17
ఇన్నిరోజులు తర్వాత పల్లవి ప్రశాంత్ నిజస్వరూపం ఇదిగో, నాగార్జునని కూడా వదిలిపెట్టకుండా..ఏం చేసినా డోంట్ కేర్
Pallavi Prashanth

బిగ్ బాస్ సీజన్ 7 ముగిసి చాలా కాలం అవుతోంది. సీజన్ 8 కి కూడా సన్నాహకాలు మొదలైనట్లు తెలుస్తోంది. కానీ బిగ్ బాస్ 7 లో జరిగిన సంచలనాలు ఇప్పటికీ ఆడియన్స్ మరచిపోలేకున్నారు. సీజన్ 7లో సాధారణ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. 

 

27
Pallavi Prashanth

ఈ సీజన్ లో శివాజీ, అమర్ దీప్, రతిక, ప్రియాంక, శోభా శెట్టి, అర్జున్, షకీలా, టేస్టీ తేజ లాంటి వారు ప్రధాన కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. పల్లవి ప్రశాంత్.. శివాజీ అండదండలతో తనదైన శైలిలో గేమ్ ఆడుతూ దుసుకుపోయాడు. షో బిగినింగ్ లో రతికతో పల్లవి ప్రశాంత్ రొమాన్స్ అతడికి బాగా పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఉహించని కంటెస్టెంట్స్ కొందరు ఫైనల్ టాప్ 5 వరకు ఉన్నారు. 

 

37
Pallavi Prashanth

టాప్ 5 లో ఉంటారనుకున్న వారు, కొందరు క్రేజీ సెలెబ్రిటీలు ముందుగానే ఎలిమినేట్ అయ్యారు. వారిలో ప్రధానంగా చెప్పాల్సింది షకీలా గురించి. షకీలా ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో మంచి మసాలా ఉంటుందని అంతా భావించారు. కానీ ఆమె త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ తన ఎలిమినేషన్ గురించి సంచలన వ్యాఖలు చేసింది. అదే విధంగా పల్లవి ప్రశాంత్, శివాజీ, నాగార్జున గురించి కూడా కొన్ని వివాదాస్పద వవ్యాఖ్యలు చేసింది. 

 

47

సందీప్, అమర్ దీప్, దామిని, ప్రియాంక హౌస్ లో తనకి నిజాయతీ పరులుగా అనిపించినట్లు షకీలా తెలిపారు. వాళ్ళల్లో నాకు ఎలాంటి తప్పులు కనిపించలేదు. వాళ్ళ కళ్ళల్లో నిజాయితీనే చూశాను అని తెలిపింది. శివాజీ అయితే న్యూట్రల్ పర్సన్ లాగా అనిపించారు. ఆయన నిజాయతీ పరుడా కాదా అనేది నేను చెప్పను. కానీ వీక్ గా అనిపించిన కంటెస్టెంట్స్ కి మాత్రం తన సాయం అందించాడు. 

 

57

ఇక యాంకర్ పల్లవి ప్రశాంత్ గురించి అడగగా.. ఆమె బోల్డ్ గా సమాధానం ఇచ్చింది. నా సమాధానం విని పల్లవి ప్రశాంత్ అభిమానులు ఏం చేసినా పర్వాలేదు. ఐ డోంట్ కేర్.. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి పిల్లి లాగా వచ్చాడు. బిగినింగ్ లో పిల్లిలాగా బిహేవ్ చేసేవాడు. వినయం నటించాడు. ఆ తర్వాత కాస్త గుర్తింపు రాగానే.. తన ముందు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారని కూడా చూడలేదు. 

 

67
Bigg Boss Telugu 7

అతడి కళ్ళు నెత్తికెక్కాయి. యాక్టిట్యూడ్ పూర్తిగా మారిపోయింది. సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదు. సీనియర్స్ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ యాటిట్యూడ్ ప్రదర్శించాడు. అది నాకు నచ్చలేదు అని షకీలా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

77
Bigg Boss Telugu 7

ఇక తనని మాత్రం బిగ్ బాస్ లోకి కేవలం పబ్లిసిటీ కోసమే తీసుకున్నారు, వాళ్ళ అవసరం తీరిపోయాక నన్ను పంపించేశారు. అంతే జరిగింది అని షకీలా తెలిపారు. బిగ్ బాస్ వల్ల నాకు ఏదో ఒరుగుతుంది అని నేను రాలేదు. పేమెంట్ ఇచ్చారు వచ్చాను. బిగ్ బాస్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.. ఒక్క నాగార్జున గారికి తప్ప. ఎందుకంటే స్టూడియో ఆయనదే, హోస్ట్ ఆయనే.. కాబట్టి ఆయనకి మాత్రమే లాభం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

 

click me!

Recommended Stories