యువ నటుడు సుహాస్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రైటర్ పద్మభూషణ్, కలర్ ఫోటో లాంటి హిట్ చిత్రాలలో నటించిన సుహాస్ రీసెంట్ గా ఫిబ్రవరి 2న అంబాజీ పేట మ్యారేజి బ్యాండు చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
సుహాస్ మ్యారేజి బ్యాండు రీ సౌండ్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే వినిపిస్తోంది. ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనితో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడ్డట్లే అని ఆడియన్స్ అంటున్నారు. ఈ చిత్రంలో సుహాస్ సోదరి పాత్రలో నటి శరణ్య ప్రదీప్ నటించారు. ఫిదా, భామ కలాపం లాంటి చిత్రాల్లో శరణ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
అంబాజీ పేట.. చిత్రంలో కూడా శరణ్యకి నటనకు ప్రాధాన్యత ఉన్న పవర్ ఫుల్ రోల్ పడింది. తన నటనతో శరణ్య మెప్పించడం మాత్రమే కాదు.. ఒక సన్నివేశంలో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కీలక మైన సన్నివేశంలో శరణ్య న్యూడ్ గా నటించి షాక్ కి గురిచేసింది.
ఆ సన్నివేశం గురించి ఓ ఇంటర్వ్యూలో శరణ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ చేయని సన్నివేశంలో నటించాలంటే కాస్త భయంగానే ఉండేది. న్యూడ్ గా నేను ఇప్పటి వరకు నటించలేదు. కాబట్టి ఆ భయం ఉండేది. కానీ నా భయాన్ని పోగొట్టి సపోర్ట్ ఇచ్చింది మాత్రం నా భర్త. నువ్వు ధైర్యంగా నటించు అని చెప్పారు. అది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్.. అంటూ నా భర్త నన్ను పుష్ చేశారు.
అదే విధంగా చిత్ర యూనిట్ కూడా నాకు సపోర్ట్ చేసింది ఆ సీన్ లో నటించేటప్పుడు సెట్ లో ఐదుగురు ఉన్నారు. డీవోపీ, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, అసిస్టెంట్స్, మరో వ్యక్తి ఇలా ఐదుగురు సెట్ లో ఉన్నప్పటికీ నేను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేశారు. కాబట్టి నా టీం కి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి అని శరణ్య తెలిపారు.
శరణ్య అంబాజీ పేట చిత్రంతో తాను బోల్డ్ గా కూడా నటించగలనని నిరూపించింది. ఇకపై శరణ్యకి మరిన్ని ఆఫర్స్ ఖాయం అని అంటున్నారు. ఈ చిత్రంలో ఎమోషనల్ గా ఆమె నటించిన విధానం ఆడియన్స్ ని కట్టి పడేస్తోంది.