Sai Pallavi: సహించరాని చిల్లర రాతలు... పెళ్లి కథనాలపై సాయి పల్లవి ఫైర్!

First Published | Sep 22, 2023, 6:42 PM IST

సాయి పల్లవి పెళ్లంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆమె స్పందించారు. తీవ్ర అసహనం బయటపెట్టారు. 
 

 సాయి పల్లవికి పెళ్ళై పోయిందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో సాయి పల్లవి, మరొక వ్యక్తి మెడలో పూల దండలు వేసుకొని ఉన్నారు. దీని ఆధారంగా ఎవరికీ తెలియకుండా సాయి పల్లవి రహస్య వివాహం చేసుకున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ న్యూస్ దర్శకుడు వేణు ఉడుగుల దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే స్పందించారు. 

వైరల్ అవుతున్న ఫోటో ఒరిజినల్ షేర్ చేసిన వేణు ఉడుగల వివరణ ఇచ్చారు. శివ కార్తికేయన్ కి జంటగా సాయి పల్లవి నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమం రోజు తీసిన ఫోటో అది అని కామెంట్ చేశాడు. సాయి పల్లవి వివాహం చేసుకున్నారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. వేణు ఉడుగుల పోస్ట్ తో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 



ఈ ఫేక్ న్యూస్ మీద సాయి పల్లవి సైతం స్పందించారు. ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాయి పల్లవి ట్విట్టర్ వేదికగా... ''సాధారణంగా రూమర్స్ ని నేను పట్టించుకోను. కానీ కుటుంబ సభ్యులు వంటి మిత్రులను ఇన్వాల్వ్ చేసి రాస్తుంటే తప్పడం లేదు. చెడు ఆలోచనలతో కొందరు కావాలని ఓ సినిమా పూజా కార్యక్రమ సమయంలో తీసిన ఫోటోను కట్ చేసి పెళ్లి ఫోటో అంటూ చిల్లర రాతలు రాస్తున్నారు. 
 


ఒక మంచి విషయాన్ని అభిమానులకు షేర్ చేస్తే దాన్ని ఇలా పక్కదారి పట్టించడం క్షమించరాని నేరం, నీచం...'' అని కామెంట్ చేశారు. సాయి పల్లవి సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. సాయి పల్లవి పెళ్లి పై తరచుగా రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆ మధ్య  సాయి పల్లవి సినిమాలు తగ్గించారు. విరాటపర్వం అనంతరం సాయి పల్లవి తెలుగులో సినిమా చేయలేదు. అటు తమిళ్ లో కూడా కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించలేదు. దీంతో సాయి పల్లవి వివాహం చేసుకోబోతున్నారు. అందుకే సినిమాలు వదిలేశారని కథనాలు వెలువడ్డాయి.   
 

Photo Courtesy: Instagram


అలాగే డాక్టర్ చదివిన సాయి పల్లవి హాస్పిటల్ ఓపెన్ చేసి వైద్య వృత్తిలో కొనసాగాలని అనుకుంటున్తున్నారని మరో వాదన తెరపైకి వచ్చింది. అయితే మంచి సబ్జక్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాను. అందుకే ఆలస్యం అవుతుంది. సాయి పల్లవి అంటే ప్రేక్షకులు వాళ్ళ ఇంట్లో అమ్మాయి అనుకుంటారు. వారు గర్వపడే సినిమాలు చేయాలి అన్నారు. 

తాజాగా నాగ చైతన్యకు జంటగా భారీ పాన్ ఇండియా చిత్రానికి సాయి పల్లవి సైన్ చేసింది. చందూ మొండేటి దర్శకుడు కాగా అల్లు అరవింద్ నిర్మాత. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. గతంలో నాగ చైతన్య-సాయి పల్లవి కాంబోలో లవ్ స్టోరీ తెరకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్. 
 

Latest Videos

click me!