ఫ్రంట్ ఇలా బ్యాక్ అలా... అన్ని కోణాల్లో అందాల ప్రదర్శన చేసిన సదా, కొత్త షో కోసం!

Published : Jun 25, 2023, 03:21 PM IST

కొత్త షో కోసం కత్తిలా సిద్ధమైంది సదా. సిల్వర్ కలర్ స్లీవ్లెస్ ట్రెండీ వేర్లో కనువిందు చేసింది. అన్ని కోణాల్లో అందాల ప్రదర్శన చేసింది. సదా లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
19
ఫ్రంట్ ఇలా బ్యాక్ అలా... అన్ని కోణాల్లో అందాల ప్రదర్శన చేసిన సదా, కొత్త షో కోసం!
Sadaa


అనూహ్యంగా బుల్లితెర మీద సదా బిజీ అవుతుంది. మొన్నటి వరకు బీబీ జోడీ జడ్జిగా వ్యవహరించింది. తాజాగా నీతోనే డాన్స్ షోకి జడ్జిగా ఎంపికైంది. తన బీబీ జోడీ టీమ్ రాధ, తరుణ్ మాస్టర్ లతో పాటు నీతోనే డాన్స్ షో చేస్తుంది. 
 

29
Sadaa


అలాగే జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చింది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో కృష్ణభగవాన్ తో పాటు జడ్జిగా ఆమె ఒక ఎపిసోడ్ లో కనిపించింది. సదా రాకతో ఎక్స్ట్రా జబర్దస్త్ కలర్ ఫుల్ గా మారింది. 
 

39
Sadaa


ఇక సదాను వెండితెరకు పరిచయం చేసింది తేజానే కావడం విశేషం. తేజా కెరీర్లో అతి పెద్ద హిట్ గా ఉన్న జయం చిత్రంలో సదా హీరోయిన్ గా చేశారు. నితిన్ సైతం ఇదే మూవీతో హీరో అయ్యాడు. జయం మూవీ సదాను ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 

49
Sadaa

అనంతరం ఎన్టీఆర్ కి జంటగా నాగా చిత్రం చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన నాగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. సదా జతకట్టిన మరో పెద్ద హీరో బాలకృష్ణ. వీరి కాంబోలో తెరకెక్కిన వీరభద్ర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 
 

59
Sadaa

మంచి ఆరంభం లభించిన  సదా కెరీర్ నిర్మించుకోలేకపోయింది. స్టార్ లేడీగా ఇండస్ట్రీని ఊపేస్తోంది అనుకుంటే టైరు టూ హీరోలకు పడిపోయారు. తెలుగులో పెద్ద హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. 
 

69
Sadaa

అనూహ్యంగా శంకర్ డైరెక్షన్ లో అపరిచితుడు చేసే అవకాశం దక్కింది. అగ్రహారం బ్రాహ్మణ అమ్మాయి పాత్రకు సదాను ఎంపిక చేశారు. శంకర్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆ పాత్రకు సదా వంద శాతం న్యాయం చేసింది. అపరిచితుడు భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 
 

79
Sadaa


అపరిచితుడు విజయం తమిళంలో అవకాశాలు తెచ్చిపెట్టింది. అయితే సదా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసింది. అలాగే కన్నడ పరిశ్రమలో కూడా రాణించింది. 2016 తర్వాత సదా కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. 2018లో టార్చ్ లైట్ టైటిల్ తో ఒక మూవీ చేసి గ్యాప్ తీసుకుంది. 
 

89
Sadaa


అహింస మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా రిటైర్ అయిన సదా ఇకపై అక్కా, వదిన పాత్రలు చెయ్యాల్సిందే. అలాగే కీలకమైన క్యారెక్టర్ రోల్స్ ఆమెకు దక్కవచ్చు. 
 

99
Sadaa

కొత్త షో కోసం కత్తిలా సిద్ధమైంది సదా. సిల్వర్ కలర్ స్లీవ్లెస్ ట్రెండీ వేర్లో కనువిందు చేసింది. అన్ని కోణాల్లో అందాల ప్రదర్శన చేసింది. సదా లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories