రష్మీకా మందన్న కాస్ట్లీ డ్రెస్ వేసుకుంది. కాస్ట్ అంటే .. అంతా ఇంతా కాదు.. ఎప్పుడూ.. ఆమె డ్రెస్ గురించి వార్తల్లో రానంత కాస్ట్లీ డ్రెస్ ను వేసుకుంది. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నంతగా కన్నడ బ్యూటీ ఏండ్రెస్ వేసుకుంది..? ఎంత కాస్ట్..?
ఈ మధ్య సినిమాల ద్వారా కాకుండా రకరకాలుగా వైరల్ న్యూస్ అవుతోంది రష్మిక మందన్నా. ఆమె మీద సోషల్ మీడియ నజర్ ఎక్కువైపోయింది. ఈక్రమంలోనే ఆమె ఎక్కడికి వెళ్తున్నా.. పక్కాగా ఫాలో అవుతున్నాయి కెమెరా కళ్ళు.. ఈక్రమంలోనే రష్మిక వెళ్తున్న విహారయాత్రపై కన్నేసింది.
27
ఇక రష్మిక మందన్న ఈ మధ్య టూర్లకు ఎక్కువగా వెళ్తుంది. అయితే ఆమె ఒంటరిగా మాత్రం వెళ్ళడంలేదని.. విజయ్ దేవరకొండ కూడా వెంట వెళ్తున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరిమధ్య సీక్రేట్ గా ఏదో నడుస్తుందంటూ.. రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
37
Image: Rashmika Mandanna Instagram
ఇక అప్పటి నుంచి రష్మికను ఎక్కవగా గమనిస్తున్నారు. అటు కాంతారా విషయంలో కూడా ఆమె వివాదాస్పదం అయ్యింది. ఇలా రకరకాలుగా వార్తల్లో నిలుస్తుంది రష్మిక మందన్నా. ఇక ఇప్పుడు ఆమె డ్రెస్ విషయంలో హాట్ టాపిక్ అయ్యింది బ్యూటీ.
47
ఈ మధ్య ఏమాత్రం షూటింగ్స్ కు బ్రేక్ దొరికినా.. విహారయాత్రలకోసం విదేశాలకు వెళ్లిపోతుంది బ్యూటీ. అక్కడ అలసటనంతా తీర్చుకుని తీరిగ్గ వచ్చేస్తుంది. ఫుల్ గా చిల్ అవుతూ అక్కడి ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. అంతే కాదు అక్కడ షాపింగ్ కూడా చేస్తూ బిజీగా గా గడిపేస్తుంది. మరి అక్కడ కొన్నదో .. ఇంకెక్కడ కొన్నదో తెలియదు కాని రీసెంట్ గా రష్మిక టూర్ లో ఓ కాస్ట్లీ డ్రెస్ త కనిపించింది.
57
ఎందుకంటే రీసెంట్ కొన్ని ఫొటోలను రష్మిక పోస్ట్ చేసింది. ఇందులో వైట్ కలర్ టాప్ వేసుకుని ఉంది. లూయిస్ వ్యూట్టన్ కంపెనీకి చెందిన సమ్మర్ స్టార్ డస్ట్ క్రాప్ట్ కార్డిగన్ అని పిలిచే ఈ టాప్ ఖరీదు అక్షరాలా 2,68, 987 అని తెలుస్తోంది. ఒక్క టాప్ కోసమే రష్మిక దాదాపు రెండు లక్షలకు పైగా ఖర్చు పెట్టిందంటే.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
67
అసలు ఇలా ఇంత కాస్ట్లీ వస్తువులు, చెప్పులు, డ్రస్సులు కొనడం సెలబ్రిటీలకు సాధారణ విషయమే కాని అసలు విషయం తెలిసినప్పుడు మాత్రం సోషల్ మీడియా జనాలు ఔరా అని అనకుండా ఉండలేకపోతున్నారు. ఇక అవన్నీ పక్కన ఉంచితే.. మనం ముందుగా చెప్పుకున్నట్టు.. ఈ ట్రిప్ లో కూడా ఈబ్యూటీ ఒక్కతే లేదట.. విజయ్ ను కూడా తోడు తీసుకెళ్ళిందని టాక్.
77
అసలు ఇంతకీ ఈ డ్రస్ ఆమె కొన్నదేనా..? లేక విజయ్ దేవరకొండ ఏమైనా గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి నెటిజన్లకు. పుష్పతో సూపర్ హిట్ కొట్టిన బ్యూటీ.. వారసుడితో పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం పుష్ప2 హడావిడిలో ఉంది రష్మిక. వరస హిట్స్ కొట్టి చాలా తక్కువ టైంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు డ్రస్సింగ్ లోనూ తన రేంజ్ చూపిస్తోంది.