చెక్, కొండపొలం డిజాస్టర్ కావడంతో రకుల్ ని టాలీవుడ్ మేకర్స్ పక్కన పెట్టేశారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో రకుల్ వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ కి జంటగా నాన్నకు ప్రేమతో, చరణ్ తో ధృవ, అల్లు అర్జున్ కి జంటగా సరైనోడు చిత్రాల్లో రకుల్ నటించారు. ప్రస్తుతం కమల్ హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 మూవీలో నటిస్తుంది.