నడుముపై చేతులేసి శ్రీముఖి మత్తు పోజులు.. ట్రెడిషనల్ లుక్ లో మైమరిపిస్తున్న బుల్లితెర రాములమ్మ

First Published | Mar 27, 2023, 6:11 PM IST

అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi)  వరుస టీవీ షోలతో బుల్లితెరపై సందడి చేస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. 
 

బుల్లితెర అందాల యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. వరుస టీవీ షోలతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ నెట్టింట ఎప్పటికప్పుడు షోలకు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తూ వస్తోంది. ఈ సందర్భంగా నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

యాంకర్ గా శ్రీముఖి కేరీర్ ప్రస్తుతం ఫుల్ జోష్ గానే ఉంది. శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోల్లో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం‘ ఒకటి. ప్రతి ఆదివారం స్టార్ మా ఛానెల్ లో ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఈషోలో స్టార్ మా టీవీ యాక్టర్స్ సందడి చేస్తున్నారు. 
 


ఈ క్రమంలో లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన అప్డేట్ ను అందించింది స్టార్ యాంకర్ శ్రీముఖి. వచ్చే ఆదివారం సంబంధించిన ఎపిసోడ్ లో తన అవుట్ ఫిట్ ను తాజాగా రివీల్ చేసింది.  ఈ సందర్భంగా స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

లేటెస్ట్ లుక్ లో శ్రీముఖి బ్యూటీఫుల్ గా ఉంది.  ట్రెడిషనల్ వేర్ లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. తన రూప సౌందర్యంతో ఫ్యాన్స్ ను మంత్రముగద్దులను చేసింది. గ్రీన్ పంజాబీ తరహా డ్రెస్ లో కట్టిపడేసింది. మరోవైపు మ్యాచింగ్ అట్రాక్టివ్ జ్యూయెల్లరీ కూడా ధరించి ఆకర్షించింది. 

ట్రెండీ వేర్స్ లోనైనా, ట్రెడిషనల్ లుక్స్ లోనైనా శ్రీముఖి అట్రాక్ట్ చేయడంలో ఏమాత్రం తగ్గదు. తాజా ఫొటోషూట్ లోనూ నడముపై చేతులేసి.. ఓర చూపుతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. తన అందంతో చూపు తిప్పుకోకుండా చేసింది. 

మరోవైపు మత్తుగా ఫోజులిస్తూ నెటిజన్లను మైకంలో ముంచేసింది. శ్రీముఖి ట్రెడిషనల్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో లైక్స్, కామెంట్లు చేస్తూ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

ఇక శ్రీముఖి బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా అలరిస్తూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకుంటూనే ఉంది. నటిగా తననుతాను ఫ్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 
చివరిగా ‘క్రేజీ అంకుల్స్’, ‘మ్యాస్ట్రో’ వంటి చిత్రాలతో అలరించింది. 

బుల్లితెరపై చాలా తక్కువ కాలంలోనే గుర్తింపు దక్కించుకున్న శ్రీముఖికి వెండితెరపై నటిగా మెప్పించేందుకు కాస్తా సమయం పడుతోంది. దీంతో వచ్చిన అవకాశాలను మాత్రం చక్కగా వినియోగించుకుంటోంది. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో నటిస్తోంది. 

Latest Videos

click me!