మహేష్ మూవీతో హీరోయిన్ భయపడిందా.. చిరు, రాంచరణ్ ఇద్దరి సినిమాలతో ఆమెకి చేదు అనుభవమే

Published : Mar 14, 2024, 05:30 PM ISTUpdated : Mar 14, 2024, 05:51 PM IST

సీనియర్ నటి రాశి కెరీర్ లో కూడా కొన్ని ఊహించని సంఘటనలు జరిగాయి. నటిగా తప్పటడుగులు వేశానని.. సరిదిద్దుకోలేక పోయానని రాశి తెలిపింది. 

PREV
17
మహేష్ మూవీతో హీరోయిన్ భయపడిందా.. చిరు, రాంచరణ్ ఇద్దరి సినిమాలతో ఆమెకి చేదు అనుభవమే

చిత్ర పరిశ్రమలో అందరికి అన్ని బెస్ట్ ఆఫర్స్ రావు. కొన్ని చేదు అనుభవాన్ని మిగిల్చే పాత్రలు కూడా వస్తాయి. కొన్నిసార్లు రిజెక్ట్ కూడా అవుతారు. అన్నింటిని అధికమిస్తూ ఎప్పటికప్పుడు నిరూపించుకునేవాళ్ళు నటీనటులుగా నిలబడతారు. ఆ కోవకి చెందిన హీరోయిన్ రాశి. హోమ్లీ లుక్స్ తో అలరించే రాశి.. ఎక్కువగా శ్రీకాంత్ తో లవ్ స్టోరీస్ చేసింది. 

 

27

సీనియర్ నటి రాశి కెరీర్ లో కూడా కొన్ని ఊహించని సంఘటనలు జరిగాయి. నటిగా తప్పటడుగులు వేశానని.. సరిదిద్దుకోలేక పోయానని రాశి తెలిపింది. రాశి గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉండేది. రమ్యకృష్ణ, రంభ, సాక్షి శివానంద్ లాంటి హీరోయిన్లు గ్లామర్ రోల్స్ చేస్తున్న సమయంలో రాశి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ రాశి ఎక్స్ ఫోజింగ్ కి ఆమడ దూరం ఉండేది. 

 

37

తనదైన పంథాలో రాశి.. వడ్డే నవీన్, శ్రీకాంత్ లాంటి హీరోలతో ప్రేమ చిత్రాలు చేసేది. కెరీర్ సాగిపోతున్న తరుణంలో ఆమెకి మహేష్ బాబు నిజం చిత్రంలో విలన్ కి జోడిగా నటించే ఛాన్స్ వచ్చింది. రాశికి అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు. కానీ తేజ ఆ పాత్ర లో ఎలాంటి అసభ్యత ఉండదని.. రోల్ బావుంటుందని చెప్పారట. దీనితో అడ్వాన్స్ తీసుకుంది. 

 

47

కానీ మొదటి రోజు షూటింగ్ లోనే ఆమెకి ఆ పాత్ర ఎలాంటిదో అర్థం అయిపోయింది. ఇన్నిరోజులు తెలుగు ప్రేక్షకుల్లో సంపాదించుకున్న హోమ్లీ ఇమేజ్ ఈ చిత్రంతో నాశనం అయిపోతుందని భయపడిందట. డైరెక్టర్ తేజ చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని మండిపడ్డారు. కానీ అడ్వాన్స్ తీసుకున్నాక ఆ మూవీ చేయక తప్పలేదు. ఒక ఆర్టిస్ట్ గా ఆ పాత్రకి తాను న్యాయం చేశానని రాశి తెలిపింది. 

 

57

తన కెరీర్ ఇక ఎండింగ్ కి వస్తుంది అనుకుంటున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి గారితో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది. ఆ మూవీలో నాతో పాటు ఆర్తి అగర్వాల్ కూడా హీరోయిన్. వి ఎన్ ఆదిత్య దర్శకుడు. అంతా ఫైనల్ అయిన తర్వాత ఆ మూవీ ఆగిపోయింది అని రాశి నిరాశ వ్యక్తం చేసింది. ఆ చిత్రంలో నటించి ఉంటే.. టాలీవుడ్ హీరోలందరితో ఇంకో రౌండ్ నటించి చుట్టేసేదాన్ని అని తెలిపింది. కానీ బ్యాడ్ లక్ ఆ మూవీ సెట్ కాలేదు. 

 

67

నిజం చిత్రం మిగిల్చిన చేదు అనుభవంతో రాశి మరో క్రేజీ ఆఫర్ వదిలేసుకుంది. డైరెక్టర్ తేజ.. వల్గర్ గా ఏమి ఉండదని చెప్పి నిజంలో బ్యాడ్ క్యారెక్టర్ చేయించారు. ఆ ఫీలింగ్ రాశి మనసులో అలాగే ఉండిపోయినట్లు ఉంది. ఇక సుకుమార్ రాంచరణ్ రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా ముందుగా అనుకుంది రాశినే. 

 

77

ఆమెకి వెళ్లి క్యారెక్టర్ వివరించారు. మోకాల్లపైకి శారీ కట్టాల్సి ఉంటుందని సుకుమార్ చెప్పారట. స్టోరీ చెప్పేటప్పుడు మోకాళ్ళపైకి శారీ అంటున్నారు.. ఇక సినిమాలో ఎంత బోల్డ్ గా చూపిస్తారో అని రాశి భయపడిందట. మరోసారి నిజం లాగా కాకూడదని.. రంగమ్మత్త పాత్రకి నేను సెట్ కానీ అని రిజెక్ట్ చేసేసింది. ఆ ఆఫర్ ని అనసూయ ఒడిసి పట్టుకుంది. రంగస్థలం రిలీజ్ అయ్యాక ఆ రోల్ చాలా అద్భుతంగా ఉంది.. చేసి ఉంటే బావుండేది అని రాశి ఫీల్ అయిందట. ఈ విషయాలని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 

 

click me!

Recommended Stories