వివాహం తర్వాత కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు. సినిమాలతో పాటు బుల్లితెర షోలలో సందడి చేస్తున్నారు. పూర్ణకు మంచి ఆరంభం లభించింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని కారణాల వలన పలు ఆఫర్స్ వదులుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు.