Intinti Gruhalakshmi: అత్తకు చెమటలు పట్టించిన దివ్య.. నందును తప్పుడు సాక్ష్యంతో ఇరికించిన లాస్య?

Published : May 15, 2023, 08:48 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో మంచి రేటింగ్ తో ముందుకి దూసుకుపోతుంది. తనకి ఎదురైన సమస్యకి భయపడకుండా తెలివిగా ఎదుర్కొంటున్న ఒక కొత్త కోడలు కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
110
Intinti Gruhalakshmi: అత్తకు చెమటలు పట్టించిన దివ్య.. నందును తప్పుడు సాక్ష్యంతో ఇరికించిన లాస్య?

ఎపిసోడ్ ప్రారంభంలో మా అత్తగారి మనసు చాలా మంచిది ఆవిడ మా మంచినే కోరుకుంటుంది అంటూ ఎంతో చాకచక్యంగా మాట్లాడుతూ అత్తగారి పక్కనే కూర్చుంటుంది దివ్య. అదేంటి అక్కడ కూర్చున్నావు పెద్దవాళ్ళకి కాస్త మర్యాద ఇవ్వు అంటుంది బసవయ్య భార్య. మీరు ఎందుకు అలా అనుకుంటారు నేను తన పక్కన కూర్చున్నందుకు చాలా సంతోషిస్తుంది.

210

కూతురు లేని లోటు తీరుస్తుంది అనుకుంటుంది అంటూ అత్తగారితో పుట్టింటికి వెళ్లి వస్తాను అని చెప్తుంది దివ్య. అదేంటి మూడు రాత్రులు అవ్వకుండా కడుప దాటకూడదు అంటుంది బసవయ్య భార్య. అత్తయ్య అవనివ్వదు కదా అంటుంది దివ్య. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అదేంటి అలా అంటావు ఆవిడకి ఏమి అవసరం అంటాడు బసవయ్య.

310

అంటే ముహూర్తాలు లేకపోతే ఆవిడ మాత్రం ఏం చేస్తారు అంటూ తెలివిగా సమాధానం ఇస్తుంది దివ్య. ముహూర్తం లేట్ అయితే నేను ఆగగలను కానీ విక్రమ్ ఆగలేడు తను నా దగ్గరికి రాకుండా కాపలా కాయవలసిన బాధ్యత మీదే ఒకసారి నా భర్త నా చేతిలోకి వస్తే తర్వాత మీరు చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిందే తర్వాత మీ ఇష్టం అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దివ్య.
 

410

నాకు ఏదో తేడా కొడుతుంది అక్కయ్య.. జాగ్రత్త అంటూ హెచ్చరిస్తాడు బసవయ్య. మరోవైపు కోర్టులో ఎలా నడుచుకోవాలో అత్తగారికి, మామగారికి ట్రైనింగ్ ఇస్తాడు మాధవి భర్త. తులసికి కూడా ఏదో చెప్పబోతుంటే నేను కోర్టుకు రావటం లేదు అన్నయ్య అంటుంది. అదేంటమ్మా అలా అంటావ్ నువ్వు వస్తే మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అంటుంది అనసూయ.

510

ఈ విషయంలో దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నందు కూడా ఈ గొడవలలో తనని ఇన్వాల్వ్ చేయకండి తనని ఇబ్బంది పెట్టకండి అంటాడు. మరోవైపు సంజయ్ దగ్గరికి వచ్చి మీతో హాస్పిటల్ లో గొడవ పడింది ఎవరు నా తమ్ముని అన్ని మాటలు అన్నాడంటే నాకు ఎంత అవమానం వాడు ఎవడో చెప్పు అంటాడు విక్రమ్.
 

610

వదిలేయ్ అన్నయ్య అసలే వాడు ఎమ్మెల్యే మనిషి అంటాడు సంజయ్. ఎవడైతే మనకేంటి రేపు పొద్దున్న హాస్పిటల్ కి రమ్మను తేల్చుకుందాము అంటాడు విక్రమ్. అంతలోనే దివ్య అక్కడికి వచ్చి రేపు మనకి ప్రోగ్రాం ఉంది మర్చిపోయారా అంటుంది. అవును కదా అనుకుంటూ అతనిని రేపు మధ్యాహ్నం రమ్మనమను అని చెప్పి దివ్య వెనకాల వెళ్ళిపోతాడు విక్రమ్.
 

710

అప్పుడే అక్కడికి రాజ్యలక్ష్మి, బసవయ్య వస్తారు. వీడు పూర్తిగా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు వీడు ఇంక చేజారి పోయినట్లే అంటాడు బసవయ్య. ఏదైనా నేను రంగం లోకి దిగక ముందే దిగిన తరువాత నేనేంటో వాడితో పాటు నీకు కూడా అర్థమయ్యేలాగా చేస్తాను అంటూ కోపంతో రగిలిపోతుంది రాజ్యలక్ష్మి. మరోవైపు కోర్టులో మీరు కేసు గెలవాలంటే మీ భర్త మిమ్మల్ని కొట్టినట్లుగా సాక్ష్యం కావాలి అంటాడు లాయర్.

810

అప్పుడే అక్కడికి ఓ వ్యక్తి వస్తుంది. ఒకప్పుడు తను మా దగ్గర పనిచేసేది అంటూ నోట్ల కట్టలు ఆమె ముందు పెడుతుంది లాస్య. డబ్బు చూసిన మంగమ్మ నందు బాబు గారు రోజు అమ్మగారిని కొట్టేవారు ఆయన లాంటి భర్త ఎవరికీ ఉండకూడదు నాకు నువ్వు కూడా చాలాసార్లు లాగారు అని చెప్తే కన్నీరు పెట్టుకుని ఈ డైలాగులు సరిపోతాయా అంటుంది.
 

910

ఈ ఎవిడెన్స్ చాలు రెచ్చిపోతాను అంటాడు లాస్య లాయర్. మరోవైపు లాస్య తులసికి ఫోన్ చేసి నన్ను బాగా చూసుకుంటాను తులసివైపు ఎప్పుడు కన్నెత్తి చూడని బాండ్ పేపర్ రాసి ఇవ్వమను అప్పుడు కాంప్రమైజ్ అవుతాను అంటుంది. ఎదుటివాళ్ళు తప్పు చేశారని చెప్తున్నావ్ కానీ నీతో ఒప్పుకోవడం లేదు కావాలని నువ్వే దివ్య జీవితాన్ని రాజ్యలక్ష్మి కి తాకట్టు పెట్టాను. మరెప్పుడూ ఇలాంటి తప్పుడు పని చేయను అని నువ్వు కూడా బాండ్ పేపర్ మీద రాయు అంటుంది తులసి. తెలివిగా ఇరికిద్దామనుకుంటున్నావేమో ఎలాగైనా ఈ కేసు నేనే గెలుస్తాను అంటుంది లాస్య. 

1010

అంత అహంకారం చూపించకు అది ఎప్పటికైనా ప్రమాదమే అంటూ ఫోన్ పెట్టేస్తుంది తులసి. తరువాయి భాగంలో కోర్టుకి బయలుదేరుతూ ఉంటారు విక్రమ్ వాళ్ళు. అక్కడే ఉన్న పంతులుగారు ఇన్నాళ్లు మీరు చేసిన పూజ వృధా అయిపోతుంది మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పటంతో నీ ఆరోగ్యం కన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు అంటూ కోర్టుకు వెళ్లకుండా ఉండిపోతాడు విక్రమ్. మరోవైపు కోర్టులో లాస్య మనిషి దొంగ సాక్ష్యం చెప్తుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

click me!

Recommended Stories