ఇటీవల బాలీవుడ్ లో కూడా అదృష్టం పరీక్షించుకున్నారు ప్రణీత. వరుసగా రెండు హిందీ చిత్రాలు చేశారు. హంగామా 2, బుజ్ చిత్రాల్లో ప్రణీత హీరోయిన్ గా నటించారు. కోవిడ్ సమయంలో ప్రణీత తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో పేదలకు అవసరమైన ఆహారం సొంత ఖర్చులతో అందించారు. ప్రణీత పేరెంట్స్ డాక్టర్స్ కాగా ఆ కోణంలో కూడా పలువురికి సహాయం చేసింది.