ఇండియాలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఢిల్లీలోనే ఆగిన మెగాపవర్ స్టార్.. ఎందుకంటే?

First Published | Mar 17, 2023, 3:56 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆస్కార్ ఈవెంట్ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే హైదరాబాద్ కు రాకుండా ఢిల్లీలోనే ఆగారు. ఫ్యాన్స్ చెర్రీకి గ్రాండ్ వెల్కమ్ పలికారు.
 

‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ ను సాధించిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణి, కాలభైరవ అండ్ టీమ్ ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే నగరంలో అడుగుపెట్టారు. తారక్ కు ఎయిర్ పోర్టులోనే ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్కమ్ పలికిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కడం పట్ల తారక్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే చరణ్ మరో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో పాల్గొనాల్సి రావడంతో హైదరాబాద్ లో ఇంకా అడుగుపెట్టలేదు. 
 

ఇండియా టుడే కాన్ క్లేవ్ (India Today Enclave) ఈవెంట్ కు రామ్ చరణ్ ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో ప్రధాని మోడీ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సచిన్ హాజరై తన ప్రసంగాన్ని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. వీరితో పాటు రామ్ చరణ్ కూడా స్టేజీపై మెరియబోతున్నారు. ‘ఆస్కార్’ సాధించిన తర్వత ఇండియాకు ఇవ్వాలే తిరిగి వచ్చి ఈఈవెంట్ లో పాల్గొన బోతున్నారు. 
 


ఈ సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఢిల్లీలోనే ల్యాండ్ అయ్యారని తెలుస్తోంది. కాగా, ఫ్యాన్స్ ఆయనకు అక్కడే గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. మెగా పవర్ స్టార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇందుకు చరణ్ సైతం చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, ఢిల్లీ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. నాటు నాటు సాంగ్ దేశ ప్రజల సాంగ్ గా మారిందన్నారు. ఆస్కార్ వరకు వెళ్లేలా చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
 

ఇదిలా ఉంటే న్యూఢిల్లీలో మార్చి 17, 18న (ఇవ్వాళ, రేపు) ఇండియా టుడే ఎన్ క్లేవ్ ఈవెంట్ గ్రాండ్ గగా జరగబోతోంది. ఈవెంట్ లో రామ్ చరణ్ ను ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ వేదికపైనే రామ్ చరణ్ ఆస్కార్ తర్వాత ఫస్ట్ స్పీచ్ ఇవ్వబోతుండటం తో ఆసక్తి నెలకొంది.  
 

రాత్రి 9:30 గలకు మీడియాతో రామ్ చరణ్ మాట్లాడుతున్నారు. ఇందుకోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇండియా టుడే కాన్ క్లేవ్ ఈవెంట్ కు మోడీ, సచిన్, రామ్ చరణ్ తో పాటు.. అమిత్ షా, జాన్వీ కపూర్, మలైకా అరోరా తో సహా ఆయా రంగాల్లోని ప్రముఖులు హాజరు కానున్నారు. 

ఇక ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ కు అభిమానులు గ్రాండ్ గా వెల్కమ్ పలికిన చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చరణ్ స్లైలిష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే.. చరణ్ ప్రస్తుతం ‘ఆర్సీ15’లో నటిస్తున్నారు. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కానుంది. అలాగే దర్శకుడు బుచ్చిబాబుతో ‘ఆర్సీ16’ పట్టాలెక్కబోతోంది.
 
 

Latest Videos

click me!