కానీ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైతూ, సామ్ విడిపోతున్నట్టుగా, ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టుగా ప్రచారం ఊపందుకుంది. దీనిపై సమంత కూడా స్పందించి ఖండించారు. కానీ అనుకున్నదే జరిగింది. ఈ ఇద్దరు 2021లో అక్టోబర్ 2న విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు, సినీ వర్గాలకు షాక్ ఇచ్చారు. స్నేహపూర్వకంగానే విడిపోతున్నట్టు ప్రకటించారు. ఒకే నోట్‌ని ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థాలకు పిల్లలు కనడం, ఎక్స్ పోజింగ్, ధరించే దుస్తుల విషయంలో విభేదాలు తలెత్తాయని, పైగా `పుష్ప`లో ఐటెమ్ సాంగ్ చేయడం కూడా నాగ్ ఫ్యామిలీకి నచ్చలేదని, అదే వివాదానికి దారి తీసి విడాకుల వరకు వెళ్లిందనే రూమర్స్ వినిపించాయి.