బాబోయ్.. టూ పీస్ బికినీలో షాకిచ్చిన బాలయ్య భామ.. నిలువెత్తు అందాలతో హీటు పుట్టిస్తున్న ప్రగ్యా జైశ్వాల్.!

First Published | Mar 1, 2023, 6:36 PM IST

‘అఖండ’ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) బికినీలో దర్శనమిచ్చి నెట్టింట దుమారం రేపుతోంది. కాస్తా పద్ధతిగా మెరిసే ఈ ముద్దుగుమ్మ బోల్డ్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది.
 

హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా  బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట  దుమారం  రేపుతోంది.  తాజాగా  ఈ బ్యూటీ షేర్  చేసిన పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు షాక్ అవుతున్నారు. 
 

ప్రస్తుతం తెలుగు సినిమాల్లోనే అలరిస్తున్న నార్త్ బ్యూటీ  ప్రగ్యా జైశ్వాల్  చివరిగా ‘అఖండ’ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు, నందమూరి బాలయ్య సరసన చక్కటి నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘సన్ ఆఫ్ ఇండియా’లోనూ మెరిసింది.  
 


సినిమాల విషయంలో ప్రగ్యా కాస్తా వెనకబడే ఉన్నా.. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. వెండితెరపై పద్ధతిగా మెరుస్తున్నప్పటికీ.. నెట్టింట మాత్రం బోల్డ్ లుక్స్ లో దర్శనమిచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్య పరుస్తోంది. ఈ క్రమంలో తాజాగా బికినీలో దర్శనమిచ్చింది.
 

ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ప్రగ్యా జైశ్వాల్ ఓ బీచ్ లో దర్శనమిచ్చింది. టూపీస్ బికినీలో బీచ్ ఇసుకపై వజ్రాసనం పోజులో కూర్చొని మంటలు రేపుతోంది. అసలైన అందాల వేడితో సమ్మర్ హీట్ ను ముందుగానే రప్పిస్తోంది. ఊహించని విధంగా మెరిసి మతులు పోగొడుతోంది.

బ్లూ ప్రింటెడ్ బికినీ ధరించి పరువాలను ప్రదర్శించింది.  సముద్రం వైపు చూస్తూ.. ఇసుకలో పడుకొని.. రకరకాలుగా ఫొటోలకు ఫోజులిచ్చింది. బాలయ్య భామ ఇలా రెచ్చిపోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ప్రగ్యా గ్లామర్ ట్రీట్ కు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. రీసెంట్ గా మళ్లీ బాలయ్య సరసనే ఓ యాడ్ షూట్ చేసింది. తదుపరి చిత్రాల కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అదిరిపోయే అవుట్ ఫిట్లలో కనువిందు చేస్తోంది. లేటెస్ట్ బికినీ పోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Latest Videos

click me!