అంతే కాదు డాన్స్ ద్వారా కూడా ఫిట్ నెస్ ను సాధిస్తుందట ప్రగ్యా. ఆమె మాట్లాడుతూ..నా దృష్టిలో నృత్యాన్ని మించిన కసరత్తు లేదు. కాబట్టే, రోజు విడిచి రోజు డ్యాన్స్ చేస్తాను. నిజానికి నేను ఏ డ్యాన్స్ స్కూల్లో చదువుకోలేదు. కానీ, నాట్యమంటే ముందు నుంచీ ఇష్టం. ఓ డ్యాన్స్ ట్రూప్ ద్వారానే నేను సినిమాల్లోకి వచ్చాను. అందుకే నాట్యానికి ఎంతో రుణపడి ఉంటాను అన్నది బ్యూటీ.