నటనకు ఆస్కారమున్న పాత్రలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నానంటోంది పాయల్ రాజ్ పుత్. అందులో భాగంగానే జిన్నా సినిమా చేశానంటోంది. జిన్నా సినిమాలో పచ్చళ్లు అమ్ముకునే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తానంటోంది పాయల్. ఈ పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్, డిక్షన్ ను మార్చుకోవడం, పల్లె భాషను అలవాటు చేసుకోవడం బాగా నచ్చిందట పాయల్ రాజ్ పుత్ కు. అంతే కాదు ఇది తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది అంటోంది.