Payal Rajput: బారులో చుక్కేస్తూ ఎంజాయ్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ పాయల్.... చీర్స్ చెబుతున్న ఫ్యాన్స్ 

Published : Jul 22, 2022, 04:15 PM IST

పాయల్ రాజ్ పుత్ బార్ లో తేలారు. ఫుల్ బాటిల్స్ మధ్యలో కూర్చొని కిరాక్ ఫోజులిచ్చారు. చేతిలో  మందు సీసాలతో చుక్కేస్తున్నట్లు పాయల్ కలరింగ్ ఇచ్చారు. ఇక పాయల్ ని అలా చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
17
Payal Rajput: బారులో చుక్కేస్తూ ఎంజాయ్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ పాయల్.... చీర్స్ చెబుతున్న ఫ్యాన్స్ 
Payal Rajput


చీర్స్ చెబుతున్న పాయల్ కి చీర్స్ అంటూ సమాధానం చెబుతున్నారు. పాయల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి. మరి ఏదైనా షూట్ లో భాగంగా పాయల్ అలా కనిపించారా లేదా నిజంగా బార్ కి వెళ్ళారా అనేది తెలియదు. 

27
Payal Rajput


ఇక సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఎదిగారు. ఆర్ ఎక్స్ 100 మూవీతో పాయల్ వెండితెరకు పరిచయమయ్యారు. కార్తికేయ హీరోగా 2018లో విడుదలైన ఆర్ ఎక్స్ 100 భారీ హిట్ కొట్టింది. ఆ మూవీలో పాయల్ రెచ్చిపోయి నటించింది. 

37
Payal Rajput


ఆ సినిమా ఆమెకు బోల్డ్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చింది. అది ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పాలి. ఓ తరహా పాత్రలకు ఆమె సెట్ కాదని దర్శక నిర్మాతలు భావించారు.  అందుకే ఆమెకు విరివిగా అవకాశాలు రాలేదు. 

47
Payal Rajput


దానికి తోడు పాయల్ నటించిన చిత్రాల్లో చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. సక్సెస్ రేసులో వెనుకబడ్డ పాయల్ కి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అడపాదడపా చిత్రాలు చేస్తున్నా చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. 
 

57
Payal Rajput


ప్రస్తుతం మంచు విష్ణుకు జంటగా జిన్నా మూవీ చేస్తున్నారు. జిన్నా మూవీలో పాయల్ తో పాటు సన్నీ లియోన్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే యంగ్ హీరో ఆది సాయి కుమార్ కి జంటగా తీస్ మార్ ఖాన్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి నటించినట్లు తెలుస్తుంది. 

67
Payal Rajput


వీటితో పాటు ఓ తమిళ్, ఓ కన్నడ, తెలుగు చిత్రాల్లో పాయల్ నటిస్తున్నారు. ఇక ఓటీటీ చిత్రాలు చేస్తున్నారు. ఆమె హీరోయిన్ గా నటించిన 3 రోజెస్ ఆహా లో విడుదలైంది. అంతకు ముందు అనగనగా ఓ అతిథి అనే మూవీలో నటించారు. పాయల్ కెరీర్ ప్రస్తుతం అలా మెల్లగా సాగుతుంది. 
 

77
Payal Rajput


పాయల్ రాజ్ పుత్ బార్ లో తేలారు. ఫుల్ బాటిల్స్ మధ్యలో కూర్చొని కిరాక్ ఫోజులిచ్చారు. చేతిలో  మందు సీసాలతో చుక్కేస్తున్నట్లు పాయల్ కలరింగ్ ఇచ్చారు. ఇక పాయల్ ని అలా చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories