ప్రస్తుతం తమిళ చిత్రసీమలో అగ్రనటుడిగా కొనసాగుతున్న జయం రవి ప్రముఖ నిర్మాత సుజాత కుమార్తె ఆర్తిని 2009లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా జయం రవి, ఆర్తి విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.విడాకులకు రకరకాల కారణాలు వినిపిస్తుండగా.. అందులో ఎంత వరకూ నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈలోపు మరోషాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.