గ్రాండ్‌గా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కూతురు, హీరోయిన్ ఐశ్వర్య వివాహం.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?

First Published Jun 11, 2024, 5:20 PM IST

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కూతురు ఐశ్వర్య అర్జున్‌ వివాహం గ్రాండ్‌గా జరిగింది. తంబి రామయ్య కొడుకు ఉమాపతితో సోమవారం అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరగడం విశేషం. ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

యాక్షన్‌ కింగ్‌గా తెలుగులో పాపులర్‌ అయ్యాడు అర్జున్‌. యాక్షన్‌ మూవీస్‌, దేశ భక్తి చిత్రాలతో ఆయన కన్నడ, తమిళం, తెలుగులో సినిమాలు చేసి స్టార్‌ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్‌లోనూ ఆయన హీరోగా అనేక సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. తెలుగు నటుడిగానే పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన తన కూతురు వివాహం చేశారు. 

అర్జున్‌  పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్‌ వివాహం గ్రాండ్‌గా జరిగింది. ప్రముఖ కమెడియన్‌ తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ఐశ్వర్య వివాహం సోమవారం వైభవంగా జరిగింది. అర్జున్‌ బంధుమిత్రులు, అతికొద్ది మంది సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహం జరగడం విశేషం. 

దాదాపు నాలుగు రోజులు ఈ పెళ్లి వేడుకని నిర్వహించారు. అత్యంత గ్రాండియర్ వేలో ఈ మ్యారేజ్‌ జరగడం విశేషం. జూన్‌ 7న వీరి మ్యారేజ్‌ వేడుక ప్రారంభమైంది. మొదటి రోజు హల్దీ వేడుక నిర్వహించారు. జూన్‌ 8న సంగీత్‌ కార్యక్రమం, జూన్‌ 10న ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఐశ్వర్య మెడలో మూడు ముళ్లు వేశాడు ఉపమాపతి. 
 

వీరి మ్యారేజ్‌ చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం వీరి మ్యారేజ్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ నెల 14న చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహించబోతున్నారు. దీనికి సినీ ప్రముఖులందరిని ఆహ్వానించబోతున్నారు అర్జున్‌. 
 

అర్జున్‌ కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆమె 2013లో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమై మూడు సినిమాలు చేసింది. తమిళంలో రెండు, కన్నడలో ఓ మూవీ చేసింది. కానీ అవి పెద్దగా ఆడలేదు. దీంతో గత ఆరేళ్లుగా సినిమాలకు దూరంగానే ఉంటుంది. 
 

మరోవైపు కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ తంబి రామయ్య తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న విసయం తెలిసిందే. ఆయన కొడుకు ఉమాపతి కూడా నటుడిగానే ఆకట్టుకుంటున్నారు. నెమ్మదిగా ఆయన బిజీ అవుతున్నాడు. 
 

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, నివేదితా అర్జున్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలే. పెద్ద అమ్మాయి ఐశ్వర్య అర్జున్‌, చిన్నమ్మాయి అంజనా ఉన్నారు. ఐశ్వర్య హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. దీంతో మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవుతుంది. 
 

Latest Videos

click me!