నయనతార బర్త్ డే కోసం స్పెషల్ గా ప్లాన్ చేస్తున్న విఘ్నేష్ శివన్, ఈసారి స్పెషల్ అట్రాక్షన్ వాళ్ళేనట..?

First Published | Nov 8, 2022, 5:06 PM IST

ఈనెలలో బర్త్ డే చేసుకోబోతుంది లేడీ సూపర్ స్టార్ నయతార. పెళ్లి తరువాత అది కూడా ఇద్దరు పిల్లల తల్లి తండ్రులు అయిన తరువాత చేసుకుంటున్న మొదటి పుట్టిన రోజు కావడంతో.. నయన్ భర్త్ డేను స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నాడట విఘ్నేష్ శివన్. మరి ఇంతకీ ఏం చేయబోతున్నారు. 

Heroines Onam Looks

ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినా.. నయనతార ప్లేస్ నయనతారకే ఉంది. అసలు ఈ పాటికి ఫెయిడ్ అవుట్ అయ్యి.. క్యారెక్టర్ రోల్స్ చేసుకోవల్సింది. ఇంకా హీరోయిన్ గానే కొనసాగుతోంది బ్యూటీ. అంతే కాదు. డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్లకు అయినా.. రెండు మూడు కోట్లకు మించి రెమ్యూనరేషన్ ఇవ్వడంలేదు.. కాని నయనతార దాదాపు ఆరేడు కోట్లు తీసకుంటుందని వినికిడి. 

ఫిజిజ్ మెయింటేన్ చేయడంతో పాటు.. కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తోంది నయనతార. అందుకే ఆమె ఇమేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నయన్ తో సినిమాచేసే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం ఉంటుంది మేకర్స్ కు అందుకే ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీని ఏలేస్తోంది. ఈకోవలోనే సమంత కూడా ఉంది. ఇక ఇఫ్పుడు త్రిష కూడా బయలుదేరింది. 


ఇక ఇండస్ట్రీలో రెండు ఘాటు ప్రేమ కథలు నడిపించిన నయనతార ఎట్టకేలకు తనకంటే చిన్నవాడైన దర్శకుడు విష్నేష్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది.  రీసెంట్‌గా పెళ్లి చేసుకుని అప్పుడే బిడ్డ‌కు తల్లీ తండ్రులు కూడా అయ్యారు న‌య‌న‌తార‌- విఘ్నేష్ లు . ఈ తారల ప్లానింగ్ చూసి అవాక్క‌వుతున్నారు సీనియ‌ర్ సెల‌బ్రిటీలు. ఈ నెల 18న న‌య‌న‌తార బ‌ర్త్ డే. ఇక ఈసారి బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 

nayanthara

ఇక్కడ చిన్న ఛేంజ్ ఏంటీ అంటే  లాస్ట్ బ‌ర్త్ డేకి, ఈ బ‌ర్త్ డేకి చాలా మార్పులు వచ్చాయి. నయన్ పెళ్ళి, పిల్లలు రావడం జరిగింది. మరో వైపు నయనతార ప్రేమలో ఉండగా.. దాదాపు ఐదేళ్ళు ఆమె పుట్టిన రోజును విఘ్నేష్ శివన్ చాలా స్పెషల్ గా... గ్రాండ్ గా ప్లాను చేసేవాడు. మరి ఇప్పుడు పెళ్లి పిల్లలు వచ్చేశారు. అందులోనూ 18కి  న‌య‌న‌తార‌కు 38 ఏళ్లు నిండుతాయి. 
 

గ‌త కొన్నేళ్లుగా న‌య‌న‌తార పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు ఆమె భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌.  ఈ పెళ్ల‌య్యాక వ‌స్తున్న న‌య‌న్ తొలి పుట్టిన‌రోజు ఇది. ఈ సారి ఆమెతో భ‌ర్త‌తో పాటు ఉయిర్‌, ఉల‌గం అంటూ ఇద్ద‌రు కొడుకులు కూడా ఉన్నారు. త‌న ఇద్ద‌రు కొడుకుల‌ు స్పెషల్ అట్రాక్షన్ గా తనభార్య పుట్టిన రోజు జీవితంలో గుర్తుండేలు ప్లాన్ చేస్తున్నాడటన విఘ్నేష్. ఏం చేయబోతున్నాడు అనేది సస్పెన్స్ లో పెట్టాట. తన భార్యకు కూడా తెలియకుండా చేస్తున్నాడట. 

nayanthara

అంతే కాదు ఈసారి బర్త్ డేకు ఛీఫ్ గెస్ట్ లు కూడా ఆ ఇద్దరు పిల్లలే అన్నట్టు తెలుస్తోంది. తో, భ‌ర్త‌తో, న‌య‌న్ ఎలా పుట్టిన‌రోజు వేడుక‌లు చేసుకోబోతున్నార‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి క్రియేట్ అయింది. నయన్ మాత్రం భర్త , పిల్లల మధ్య సింపుల్ గా కేక్ కట్ చేస్తే పోతుంది అని ఆలోచిస్తుందట. 

ప్ర‌స్తుతం జ‌వాన్ లాస్ట్ షెడ్యూల్  లో నయనతార పాల్గొనాల్సి ఉంది. బర్త్ డే అయిపోగానే వెళ్ళాలని చూస్తుందట నయనతార. మరి ఈ సారి బర్త్ డే ఎలా జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠగా ఉంది.. ఈ ఏడాది జూన్‌లో న‌య‌న‌తార, విఘ్నేష్ శివ‌న్ మ‌హాబ‌లిపురంలో పెళ్లి చేసుకున్నారు. గ‌త నెల 9న స‌రోగ‌సీ ద్వారా క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చారు ఈ జంట‌.

పెళ్లైనప్పటి నుంచి స్టార్ కపుల్ విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరితో మరొకరు సమయం గడుపుతూ తీపి జ్ఘాపకాలను క్రియేట్ చేసుకుంటున్నారు. మరోవైపు వీరిద్దరికి సంబంధించిన అప్డేట్స్ ను కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటేనే ఉన్నారు.

Latest Videos

click me!