తెలుగులో బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించిన స్నేహా.. చివరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లో వదినమ్మ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే టీవీ షోల్లోనూ మెరుస్తోంది. ప్రస్తుతం ‘డాన్స్ జోడీ డాన్స్ రీలోడెడ్’ షోకు జడ్జీగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.