వరుస పరాజయాలు నభా నటేష్ కెరీర్ దెబ్బతీశాయి. 2021లో విడుదలైన మ్యాస్ట్రో చిత్రం తర్వాత ఆమె మరో చిత్రానికి సైన్ చేయలేదు. అయితే ఆఫర్స్ రాక కాదు, ప్రమాదం వలన విశ్రాంతి తీసుకున్నానని నభా నటేష్ చెబుతున్నారు. ఓ ప్రమాదంలో నభా ఎడమ భుజం ఫ్రాక్చర్ అయ్యిందట. దానికి పలు సర్జరీలు జరిగాయట. కోలుకునే సమయంలో మానసికంగా శారీరకంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు ఆ మధ్య వెల్లడించారు.