యాంకర్ నుంచి నటిగా టర్న్ తీసుకున్న వర్షిణి సౌందరాజన్(Varshini Sounderajan).. నెమ్మదిగా ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణిస్తుంది. ఇటీవల రెండు చిత్రాలతో మెరిసిన ఈ భామ మరిన్ని సినిమాలతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.
ఈ క్రమంలో తాజాగా తిరుమలలో మెరిసింది వర్షిణి. శ్రీవారిని(Varshini visits TTD) దర్శించుకుంది. మంగళవారం ఉదయాన్నే ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా తిరుమల దేవస్థానం బయట దిగిన ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ఇందులో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతుంది వర్షిణి. ఆమె ఎల్లో డ్రెస్ ధరించింది. మేకప్ లేకుండా కనిపించడం విశేషం. ఒరిజినల్ అందంతో కట్టిపడేస్తుందీ హాట్ యాంకర్. మేకప్ లేకపోయినా ఆమె అందం, క్యూట్‌నెస్ మరింత పెరగడం విశేషం.
ఈ సందర్భంగా నెటిజన్లు వర్షిణిపై పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇండియన్ ట్రెడిషన్ లుక్‌లో అందంగా ఉన్నావని, అందం ఓవర్ లోడ్ అని, స్లిమ్‌గా చాలా ప్రెట్టీగా ఉన్నారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
వర్షిణి.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. `చందమామకథలు` చిత్రంలో రేణు పాత్రలో మెరిసింది. ఇది మంచి గుర్తింపే తెచ్చింది. ఆ తర్వాత `లవర్స్`లోనూ కనిపించింది. `బెస్ట్ యాక్టర్స్`, `శ్రీరామ రక్ష` వంటి చిత్రాలు చేసింది. కానీ ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.
అట్నుంచి టీవీ షోస్‌పై దృష్టి పెట్టింది. `పటాస్`లో కో హోస్ట్ గా చేసింది. అది ఈ బ్యూటీకి మంచి పాపులారిటీని తెచ్చింది. కొన్నాళ్లు `కామెడీ స్టార్స్` కి యాంకర్‌గా చేసింది. ఆ తర్వాత `జబర్దస్త్` లోనూ యాంకర్‌గా మెరిసింది. `సిక్త్స్ సెన్స్`, `భలే ఛాన్సులే`, `ఆలీతో జాలిగా` వంటి షోస్‌లో గెస్ట్ గా పాల్గొంది.
మళ్లీ ఇటీవల సినిమాలతో బిజీ అవుతుంది. `మళ్లీ మొదలైంది`, సమంత నటించిన `శాకుంతలం`లో ఆమెకి సహాయకురాలిగా, అలాగే `భాగ్ సాలే`లో సత్యకి వైఫ్‌గా నటించి మెప్పించింది. నటిగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది. అవకాశాల వేటలో శ్రీవారి సపోర్ట్ కోరుకుంటుంది వర్షిణి. అందుకే ఆయన్ని దర్శించుకుని కోరికలు కోరుకున్నట్టు టాక్.