రాయల్‌ లుక్‌లో మెరిసిపోతున్న వరుణ్‌, లావణ్య జంట.. మందు పార్టీలో బన్నీ, చరణ్‌, ఉపాసన, స్నేహారెడ్డి హల్‌చల్‌

Aithagoni Raju | Published : Oct 31, 2023 10:58 AM
Follow Us

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్నారు. దీనికోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ చేరుకుంది. అక్కడ కాక్ టెయిల్‌ పార్టీలో ఎంజాయ్‌ చేశారు. ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

16
రాయల్‌ లుక్‌లో మెరిసిపోతున్న వరుణ్‌, లావణ్య జంట.. మందు పార్టీలో బన్నీ,  చరణ్‌, ఉపాసన, స్నేహారెడ్డి హల్‌చల్‌

వరుణ్‌ తేజ్‌(VarunTej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ల మధ్య `మిస్టర్‌` సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. ఒక్క రోజులో ఈ ఇద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. పెళ్లి జీవితంలోకి అడుగుపెడుతున్నారు. అందుకు ఇటలీ వేదిక కావడం విశేషం. 
 

26

నవంబర్‌ 1న వరుణ్‌లవ్‌ పెళ్లి(VarunLav Wedding) చేసుకోబోతున్నారు. అందుకోసం ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ వెళ్లింది. మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖ, రామ్‌చరన్‌, ఉపాసన, చిరు డాటర్స్, పవన్‌ కళ్యాణ్‌, ఆయన భార్య, నాగబాబు, నిహారిక, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అల్లువారి ఫ్యామిలీలో బన్నీ, స్నేహారెడ్డి, శిరీష్‌, బాబీ, అల్లు అరవింద్‌ ఇలా అంతా ఇప్పుడు ఇటలీలో ఉన్నారు. 
 

36

అయితే రెండు రోజుల ముందే వరుణ్‌ లావణ్య పెళ్లి సందడి ప్రారంభమైంది. కాక్‌ టెయిల్‌ పార్టీతో (VarunLav Cocktail Party) ఈ పెళ్లి సందడిని షురూ చేశారు. తాజాగా టీమ్‌ నుంచి కొన్ని ఫోటోలు పంచుకున్నారు. వరుణ్‌ తేజ్‌, లావణ్యలు రాయల్‌ లుక్‌లో మెరిసిపోతున్నారు. ఇందులో వరుణ్‌ వైట్‌ బ్లెజర్‌, బ్లాక్‌ ప్యాంట్‌, లావణ్య వైట్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్నారు. 

Related Articles

46

ఇందులో అంతా డ్రెస్‌ కోడ్‌ ఫాలో అవుతున్నారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక రామ్‌చరణ్‌ వైట్‌ షర్ట్, బ్లాక్ ప్యాంట్‌ ధరించగా, ఉపాసన బ్లాక్‌ ధరించింది, బన్నీ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకోగా, స్నేహారెడ్డి వైట్‌ ధరించింది. ఇలా జంటలు బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. 
 

56

ఇక ఇందులో పెద్దవాళ్లు కవర్‌ కాకపోవడం గమనార్హం. మొత్తంగా కాక్‌ టెయిల్‌ పార్టీని మెగా ఫ్యామిలీ బాగా ఎంజాయ్‌ చేసిందని ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ఈ రోజు(అక్టోబర్‌ 31) హల్దీ, మెహందీ ఫంక్షన్‌ నిర్వహించబోతున్నారు. రేపు(నవంబర్‌ 1)న మధ్యాహ్నం రెండు గంటల 48 నిమిషాలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఇటలీలో చాలా గ్రాండ్‌ మ్యానర్‌లో డెస్టినీ వెడ్డింగ్‌ చేసుకుంటున్నారు మెగా ప్రిన్స్. 
 

66

దీనికి మెగా ఫ్యామిలీతోపాటు అతికొద్ది మంది బంధువులు, ఇతర సన్నిహితులు హాజరవుతున్నట్టు సమాచారం. నవంబర్‌ 5న ఎన్‌ కన్వెన్షన్‌లో ఇండస్ట్రీకి, ఇక్కడి సినీ, రాజకీయ ప్రముఖులకు రిసెప్షన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
Recommended Photos