అందాల డార్క్ చాక్లెట్... మృణాల్ ఠాకూర్ సాలిడ్ గ్లామర్ పై కుర్రాళ్ళ డిటైల్డ్ అబ్సర్వేషన్!

Published : Sep 05, 2023, 07:48 PM IST

అందాల భామ మృణాల్ ఠాకూర్ ఫోటో షూట్ ఫ్యాన్స్ కి భారీ ట్రీట్. స్టార్ లేడీ గ్లామర్ మతిపోగోడుతుంటే ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.   

PREV
18
అందాల డార్క్ చాక్లెట్... మృణాల్ ఠాకూర్ సాలిడ్ గ్లామర్ పై కుర్రాళ్ళ డిటైల్డ్ అబ్సర్వేషన్!
Mrunal Thakur

చాకోలెట్ కలర్ ట్రెండీ వెర్లో పరువాలను ప్రదర్శనకు పెట్టింది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). బ్యాక్ గ్రౌండ్ కూడా మ్యాచ్ అయ్యేలా కలర్ ఫుల్ ఫోటో షూట్ చేసింది. మృణాల్ సాలిడ్ గ్లామర్ టెంప్ట్ చేస్తుంటే కుర్రాళ్ళు కామెంట్ చేయకుండా ఉండలేకున్నారు.  

 

28
Mrunal Thakur

దర్శకుడు హను రాఘవపూడి మృణాల్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. నిర్మాతలకు భారీ లాభాలు పంచింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. సీత పాత్రలో మృణాల్ మైమరిపించింది. మృణాల్ కి సీతారామం మూవీ భారీ ఫేమ్ తెచ్చింది. అందుకే తెలుగులో వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. 
 

38
Mrunal Thakur


ప్రస్తుతం నేచురల్ స్టార్ నానికి (Nani) జంటగా హాయ్ నాన్న టైటిల్ తో ఒక మూవీ చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల టైటిల్ టీజర్ విడుదల చేశారు. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.  హాయ్ నాన్న డిసెంబర్ 21న విడుదల కానుంది. ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంది. 

48
Mrunal Thakur


అలాగే విజయ్ దేవరకొండతో మరొక చిత్రం ప్రకటించారు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) 13వ చిత్రంగా తెరకెక్కుతుండగా దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. తాజాగా షూటింగ్ మొదలైంది. 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 
 

58
Mrunal Thakur


కాగా మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ అయ్యారు.మరాఠీ చిత్రం విట్టి దండు తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మృణాల్ కి బాలీవుడ్ లో లవ్ సోనియా బ్రేక్ ఇచ్చింది. అనంతరం సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాల్లో నటించి పాపులారిటీ రాబట్టారు. ఇక అనేక అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని మృణాల్ ఠాకూర్ చెబుతారు. సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నం చేసే రోజుల్లో కొందరు కించపరిచారట. తాను బాడీ షేమింగ్ కి గురి చేశారట.

68
Mrunal Thakur

మట్కా అని నిక్ నేమ్ పెట్టారట. అలానే పిలుస్తూ ఎగతాళి చేసేవారట. పైగా సీరియల్ నటి అనగానే తక్కువ భావనతో చూసేవారు. కొన్ని భారీ ప్రాజెక్ట్స్ నుండి తప్పించారంటూ ఆమె వేదన చెందారు. ప్రస్తుతం బిజీ హీరోయిన్ అయ్యారు. 

78
Mrunal Thakur

ఇక ప్రేమ, పెళ్లి పట్ల మృణాల్ భిన్నమైన అభిప్రాయం కలిగి ఉన్నారు. ఆమెకు వివాహం చేసుకునే ఆలోచన లేదని చెప్పారు. మూడు పదుల వయసు దాటాకా ప్రేమ వ్యవహారాలు ఒత్తిడికి గురి చేస్తాయి. అందుకే ప్రేమ జోలికి నేను వెళ్ళను అంటుంది. 

 

88
Mrunal Thakur

ఇక పిల్లల్ని కనాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయని మృణాల్ చెప్పడం విశేషం. ప్రస్తుతం మృణాల్ వయసు 31 ఏళ్ళు కాగా పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటుంది. చెప్పాలంటే ఆమెకు ఇంకా చాలా కెరీర్ ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories