Janhvi Kapoor: అతనితో నా ప్రేమ అబద్దాలతో నడిచింది... ఫస్ట్ లవ్ పై జాన్వీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్ 

Published : Sep 05, 2023, 06:46 PM IST

స్టార్ కిడ్ పలుమార్లు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నారు. కొందరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే జాన్వీ స్వయంగా తన మొదటి ప్రేమ గురించి ఓపెన్ అయ్యింది...   

PREV
17
Janhvi Kapoor: అతనితో నా ప్రేమ అబద్దాలతో నడిచింది... ఫస్ట్ లవ్ పై జాన్వీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్ 

బాలీవుడ్ సెలెబ్స్ మధ్య లవ్ ఎఫైర్స్ సర్వసాధారణం. ఇక స్టార్ కిడ్స్ ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంటారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) టీనేజ్ నుండి ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది. తాజాగా ఆమె ఓపెన్ అయ్యారు. తన మొదటి ప్రేమ గురించి స్వయంగా వెల్లడించారు. 

 

27

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.... అప్పుడు మా ఇద్దరిలో పరిణితి లేదు. దీంతో అయోమయానికి గురయ్యాం. మా ప్రేమ అబద్దాలతో సాగింది. మా పేరెంట్స్ చదువు మీద దృష్టి పెట్టమని హెచ్చరించారు. వారి మాట వింటే మంచి భవిష్యత్తు ఉంటుందని నేను నమ్మాను. అందుకే నా తొలిప్రేమకు ముగింపు పలికాను... అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. 

37

జాన్వీ కపూర్ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అక్షత్ రాజన్ అనే వ్యక్తితో లవ్ లో పడినట్లు సమాచారం. అతడే ఆమె ఫస్ట్ లవ్ కావచ్చు. అనంతరం జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ హీరో ఇషాన్ కట్టర్ తో కూడా సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. శిఖర్ పహారియా, ఆర్యన్ కార్తీక్, ఒర్హాన్ అవిత్రమని ఇలా పలువురితో ఆమె డేటింగ్ చేశారనే పుకార్లు ఉన్నాయి. 
 

47

జాన్వీ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ దేవర. శ్రీదేవి కూతురు కావడంతో జాన్వీ సౌత్ ఎంట్రీపై ఆసక్తి ఉంది. గతంలో పలువురు మేకర్స్ ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేశారు. దర్శకుడు కొరటాల శివ ఇది సాకారం చేసి చూపారు. దేవరలో ఎన్టీఆర్-జాన్వీ జంటగా కనిపించనున్నారు. 
 

57


ఎన్టీఆర్, జాన్వీ కాంబోపై క్రేజ్ నెలకొంది. ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్(NTR), జాన్వీ మదర్ శ్రీదేవి జంటగా పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతం చేశారు. వారి వారసులైన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ మొదటిసారి జతకడుతున్నారు. హైప్ కి ఇదొక అంశం కారణమైంది. 
 

67


దేవర(Devara) వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే నిరవధికంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారట. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని విడుదలైన దేవర ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పించింది. 

77


దేవర(Devara) వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే నిరవధికంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారట. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని విడుదలైన దేవర ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పించింది. 

Read more Photos on
click me!

Recommended Stories