హైదరాబాద్ లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్..? టాలీవుడ్ లో సెటిల్ అయినట్టేనా..?

Published : Mar 19, 2023, 11:40 AM IST

టాలీవుడ్ లో సెటిల్ అయిపోతోంది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. హైదరాబాద్ లో ఇల్లు కూడా కొనేసిందట. వరుస ఆఫర్లు కొట్టేస్తున్న ముంబయ్ భామ.. భాగ్యగనరానికి అడ్రస్ మార్చేసిందట.   

PREV
16
హైదరాబాద్ లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్..? టాలీవుడ్ లో సెటిల్ అయినట్టేనా..?

మరాఠ సీరియల్స్ నుంచి బాలీవుడ్ కు చేరిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. తన టాలెంట్ తో బాలీవుడ్ లో హృతిక్ జోడీగా సూపర్ 30, జాన్ అబ్రహంతో బాట్లా హౌస్, ఫర్హాన్ జంటగా తుఫాన్ సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ. ఇక సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన చిన్నది.. తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. 

26

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన మృణాల్.. టాలీవుడ్ లో వరుస అవకాశాలు సాధిస్తోంది. ఎన్ని అవకాశాలు వచ్చినా.. ఆచి తూచి స్పందిస్తోంది బ్యూటీ. ఎలాగైనా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పాగా వేయాలని పట్టుదలతో ఉంది మృణాల్. అందుకే సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తెలుగు పరిశ్రమకుదగ్గరవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది బ్యూటీ.. 

36

ప్రస్తుతం నాని 30, సూర్య వీర్‌ చిత్రాల్లో నటిస్తున్నదీ భామ. సౌత్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తుండటంతో.. ఇక్కడేసెటిల్ అవ్వాలని చూస్తోంది చిన్నది. ఈక్రమంలోనే  ఆమె హైదరాబాద్ లో సొంత ఇల్లుకూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సంప్రదాయంగా కనిపించి ఆకట్టుకోవడమే కాదు గ్లామర్‌ పాత్రల్లో కూడా మెప్పించడం మృణాల్‌ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 
 

46

తెలుగులో అవకాశాలు పెరిగిన నాయికలు ఇటీవల హైదరాబాద్‌లో ఇళ్లు కొనుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే మృణాల్‌ ఠాకూర్‌ కూడా హైదరాబాద్‌లో ఇళ్లు కొనుక్కుందట. కొన్నాళ్ల పాటు ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం మృణాల్ కెరీర్‌ పరుగులు పెడుతోంది. రెండు పడవల ప్రయాణం చేయకుండా.. బాలీవుడ్ కు కాస్త విరామం ఇచ్చి.. తెలుగు సినిమాల ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకోవాలి అని చూస్తోంది బ్యూటీ. 

56

నానీ సరసన ఆమె నటించే సినిమా పాన్ ఇండియ రేంజ్ లో రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది తెలుగుతో పాటు 5 భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని సమాచారం. ఇక ఈసినిమాతో ఆమే రేంజ్ మారిపోబోతుంది అంటున్నారు సినీ జనాలు. 
 

66

ఇక ఇప్పటికే బాలీవుడ్ లో గుమ్రా, పూజా మేరీ జాన్‌, పిప్పా, ఆంఖ్‌ మిచోలి వంటి క్రేజీ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం మరికొన్ని హిందీ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అవి పూర్తి చేసి..సౌత్ పై పూర్తిగా కాన్సంట్రేట్ చేయాలని చూస్తోంది బ్యూటీ. 
 

Read more Photos on
click me!

Recommended Stories