క్యాండిల్ లైట్ లో వెలిగిపోతున్న హన్సిక.. టాప్ గ్లామర్ షోతో యాపిల్ బ్యూటీ సండే ట్రీట్..

First Published | Mar 19, 2023, 10:57 AM IST

స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani) ప్రస్తుతం వేకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే ఫొటోషూట్లతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన యాపిల్ బ్యూటీ అతిత్వరగా స్టార్ బ్యూటీల జాబితాలో చేరింది. బడా హీరోల సరసన నటించి తనదైన ముద్ర వేసుకుంది. 
 

కేరీర్ లో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా ప్రారంభించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరించేందుకు సిద్దంగా ఉంది. గతేడాది పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది ‘మహా’ చిత్రంతో అలరించింది.
 


ఇక గతేడాదే పెళ్లి పీటలు కూడా ఎక్కిందీ బ్యూటీ..2022 డిసెంబర్  4న తన స్నేహితుడు, జినెస్ మెన్ సోహెల్ ఖతురియాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సందప్రదాయ పద్ధతితోనే, కుటుంబ సమక్షంలోనే వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. 
 

పెళ్లి తర్వాత నుంచి హన్సిక సోషల్ మీడియాలో ఎక్కువగానే యాక్టివ్ గా కనిపిస్తోంది. భర్తతో కలిసి వేకేషన్స్, టూర్లకు వెళ్తూ  మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అదిరిపోయే లోకేషన్ల నుంచి బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా మరిన్ని ఫొటోలను షేర్ చేసుకుంది. 
 

హన్సిక ప్రస్తుతం థాయ్ లాండ్ లోని ఓ రిసార్ట్ లో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ వేకేషన్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తోంది. తాజాగా నిన్న రాత్రి క్యాండిల్ నైట్ డిన్నర్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. 
 

రెడ్ స్లీవ్ లెస్ డ్రెస్ లో హన్సిక బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. క్యాండిల్ లైట్ కు యాపిల్ బ్యూటీ మరింతగా వెలిగిపోతోంది.మరోవైపు టాప్ గ్లామర్ షోతోనూ మతులుపోగొట్టింది. సిగ్గుపడుతూ.. మత్తు పోజులతో మైమరిపించింది. ఈ ఫొటోలను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక హన్సిక ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

Latest Videos

click me!