అవకాశాల్లేక అల్లాడుతోంది హీరోయిన్ మోహ్రీన్ పిర్జాదా. ఈ మధ్య వరకూ వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ చేతిలో.. ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఇతర భాషల్లో కూడా పరిస్థితి బాలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మకెరీర్ డేంజర్ లో పడింది.
ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా.. కన్నడ ఇండస్ట్రీలో ఒక సినిమా తప్పించి ఈ బ్యూటీ చేతిలో సినిమాలేవీ లేవు. దాంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో పడిపోయింది మెహ్రీన్. అందరు హీరోయిన్లలా సోషల్ మీడియాపై కాస్త కాన్సట్రేషన్ చేస్తుందా అంటే.. అదీ లేదు. ఎప్పుడో ఒక ఫోటో షూట్ తప్పించి పెద్దగా అందాలు ఆరబోసే పని కూడా పెట్టుకోదు మెహ్రీన్.
26
చాలాకాలం తరువాత లేటెస్ట్ గా తన ఇన్ స్టాలో.. ఓ ఫోటో షూట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది బ్యూటీ. పువ్వులా వికసిస్తూ.. కుర్రకారును కవ్విస్తూ.. ఓరచూపలతో ఆకర్శిస్తోంది మెహ్రీన్. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
36
ఎఫ్ 3 తరువాత మెహ్రీన్ కు అసలు సినిమాలే లేవు. అంతకు ముందు వచ్చిన అశ్వత్థామ, మంచిరోజులు వచ్చాయి, ఎంత మంచి వాడువురా లాంటి సినిమాలు.. వరుస ప్లాప్ లుగా నిలవడంతో..మెహ్రీన్ కెరీర్ బాగా డౌన్ అయ్యింది. దాంతో ఆమె అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
46
ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్ళి క్యాన్సిల్ చేసుకుని.. మాజీ సీఎం కొడుకుని కూడా వదులుకుని..కెరీర్ పై దృష్టి పెట్టింది మెహ్రీన్. కాని సీరియస్ గా ప్రయత్నాలు మాత్రం చేయలేదనే అంటున్నారు. అవకాశాలు వెతుక్కుంటూ.. వస్తాయి అని అనుకుంటుందేమో కాని.. మెహ్రీన్ మూవీ కెరీర్ మాత్రం కాస్త డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది.
56
ఇప్పటికైనా కాస్తకళ్శు తెరిచి..ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతుందా..? లేక ఇక ఇంతే అనకుని పెళ్ళి పీటలెక్కుతుందా..? అనేది చూడాలి. నేచురల్ స్టార్ నానీ హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ తరువాత వరుస ఆఫర్లతో .. వరుస సినిమాలతో దూసుకుపోయింది.
66
అయితే కెరీర్ మాత్రం ఓ ప్లాన్ ప్రకారం సెట్ చేసుకోలేకపోయింది మెహ్రీన్. అందుకే 27 ఏళ్ళకే అవకాశాలను అందుకోలేక ఆగిపోయింది. F2, F3 సినిమాల్లో హనీగా అలరించిన బ్యూటీ ఆ ఇమేజ్ ను కూడా నిలబెట్టుకోలేకపోయిందనే చెప్పాలి. అందులోనూ.. శ్రీలీల లాంటి యంగ్..బ్యూటీఫుల్ తారలు ఎంట్రీతో... మెహ్రీన్ లాంటి హీరోయిన్లకు ఛాన్స్ లు చేజారడం కామన్ గా జరిగేదే.