పెళ్లి కళ వచ్చేసిందే బాలా... లావణ్య త్రిపాఠిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఆ మార్పు!

Published : Jul 03, 2023, 06:02 PM IST

లావణ్య త్రిపాఠికి పెళ్లి కళ వచ్చేసింది. అమ్మడు ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మెగా కోడలు కానుందన్న సంతోషం స్పష్టంగా తెలుస్తుంది.   

PREV
16
పెళ్లి కళ వచ్చేసిందే బాలా... లావణ్య త్రిపాఠిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఆ మార్పు!
Lavanya Tripathi


మరి కొద్దిరోజుల్లో లావణ్య నాగబాబు ఇంటిలో కోడలిగా అడుగుపెట్టనుంది. జూన్ 9న వరుణ్ తేజ్ తో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. కొత్త జంటను ఆశీర్వదించారు. 

 

26
Lavanya Tripathi

చాలా కాలంగా ప్రేమించుకుంటున్న లవ్ బర్డ్స్ ఏడడుగుల బంధానికి చేరువయ్యారు. నిశ్చితార్థం అనంతరం వరుణ్ తో విదేశీ విహారానికి వెళ్ళింది. కొన్ని రోజులు ఇష్టమైన ప్రదేశాల్లో చక్కర్లు కొట్టారు. ఓ ఇంటికి కోడలు అవుతున్న నేపథ్యంలో పంథా మార్చేసింది. మోడరన్ బట్టలో స్కిన్ షోకి తెరదింపి చీరల్లో సాంప్రదాయంగా సిద్దమవుతుంది. 

36
Lavanya Tripathi

 ప్రస్తుతం లావణ్య చేతిలో  ప్రాజెక్ట్ లేదు. లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరింది. ఆమెకు నటనకు గుడ్ బై చెప్పేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే పరిశ్రమలోనే ఉంటారట. నిర్మాతగా కొనసాగుతారట. 



 

46

సీరియల్ నటిగా కెరీర్ మొదలు పెట్టిన లావణ్య అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ అయ్యారు. ట్రై యాంగిల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన అందాల రాక్షసి చిత్రంలో లావణ్య నటన అద్భుతం. అల్లరి పిల్లగా లావణ్య అదరగొట్టేసింది. ఆ సినిమాతో లావణ్య ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

56


భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరుస హిట్స్ దక్కినా, హీరోయిన్ గా బిజీ కాలేకపోయారు. టూ టైర్ హీరోలతోనే లావణ్య కెరీర్ సాగింది. టాలెంట్ ఉన్నా లక్ లేక రేసులో వెనుకబడిపోయింది.

66
Lavanya Tripathi

అర్జున్ సురవరం మూవీతో ఫార్మ్ లోకి వచ్చింది అనుకుంటే... ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలు చావు దెబ్బతీశాయి. ఈ రెండు చిత్రాలు పరాజయం కావడంతో లావణ్య కెరీర్ మరింత నెమ్మదించింది.

click me!

Recommended Stories