చిరంజీవి, ఎన్టీఆర్‌లతో దూరానికి కారణం వాళ్లే.. నాపై జెలసీతోనే అంత పని చేశారు.. నటుడు శివాజీ బోల్డ్ కామెంట్స్..

Published : Jul 03, 2023, 05:03 PM IST

నటుడు శివాజీ నటుడిగా ఇటీవల గ్యాప్‌ తీసుకున్నారు. ఇప్పుడు మల్లీ సినిమాల్లోకి రావడానికి, యాక్టర్‌గా బిజీ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద స్టార్స్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

PREV
16
చిరంజీవి, ఎన్టీఆర్‌లతో దూరానికి కారణం వాళ్లే.. నాపై జెలసీతోనే అంత పని చేశారు.. నటుడు శివాజీ బోల్డ్ కామెంట్స్..

నటుడు శివాజీ.. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసి మెప్పించారు. కామెడీ సినిమాలతో బిజీ హీరోగానూ నిలిచారు. ఒకప్పుడు మంచి స్టార్‌ స్టేటస్‌ని అనుభవించారు. ఇప్పుడు సైలెంట్‌ అయ్యారు. రాజకీయాల వైపు, సామాజిక కార్యక్రమాలపై ఫోకస్‌ పెంచి, సినిమాలు తగ్గించారు. ఇప్పుడు మళ్లీ నటుడిగా సినిమాల్లో చేసేందుకు సిద్ధపడుతున్నారు. బలమైన పాత్రలు వస్తే నటిస్తానని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన టాలీవుడ్‌ స్టార్స్ పై, ప్రముఖ సీనియర్‌ ఆర్టిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

26

నటుడు శివాజీ.. తాజాగా ఓ యూట్యూబ్‌(అంజీ టాక్స్) ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను, షాకింగ్‌ విషయాలను వెల్లడించారు. తనని కొందరు ఎలా తొక్కేయాలని చూశారో వెల్లడించారు. ఆకలింపు చేసుకోలేని సంఘటనల గురించి చెబుతూ తనకు ఎదురైన సంఘటనలను పంచుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, ఎన్టీఆర్‌ల నుంచి తనని దూరం చేసేందుకు చేసిన కుట్రలను ఆయన బయటపెట్టారు. ప్రముఖ ఆర్టిస్టు వల్ల ఎదురైన అవమానం గురించి చెప్పారు శివాజీ ఇండస్ట్రీలోని ఓ పెద్ద మనిషి చనిపోయారని, తండ్రి పోయిన బాధలో ఉన్నారని, ఓదార్చడం కోసం ఆయన్ని హగ్‌ చేసుకోవాలని వెళ్లగా, తన రెండు చేతులు పక్కకు తీసేశాడని తెలిపాడు. వారిని టచ్‌ చేయాలంటే హోదా ఉండాలనేది అర్థమయ్యిందన్నారు. 
 

36

అతను దైవం, ఆధ్యాత్మిక సమావేశాలకు హాజరవుతుంటాడని, గొప్ప గొప్పమాటలు చెబుతుంటాడని వాపోయారు. జీవితం చాలా చిన్నది, ఎందుకింత బేధాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు శివాజీ. అతను ఇండస్ట్రీలో పెద్ద పేరున్న వ్యక్తి అంటూ హింట్‌ కూడా ఇచ్చారు. ఆథ్యాత్మిక విషయాల గురించి చెబుతుంటాడనే హింట్‌ ఇస్తూ అతనికి ఇవన్నీ అర్థం కావాలని శివాజీ చెప్పడం గమనార్హం. 
 

46

మరో పెద్ద ఆర్టిస్ట్ గురించి చెప్పుకొచ్చాడు శివాజీ. తనపట్ల చాలా జెలసీగా, ఓర్వలేని తనంతో ఉండేవాడని, తనకు ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారని చెప్పి నిర్మాతతో లేనిపోనిది చెప్పి రెమ్యూనరేషన్‌ ఇవ్వకుండా చేశాడని తెలిపారు. దీంతో ఆ నిర్మాత తనకు ఒప్పుకున్న పారితోషికంలో కొంత ఎగ్గొట్టాడని, అందుకు కారణం ఆ పెద్ద ఆర్టిస్టే అని ఆరోపించాడు. తన కెరీర్‌ వేగంగా గ్రోత్‌ అయ్యింది. అది చూసి తట్టుకోలేక ఇలాంటివి చేస్తున్నాడని తెలిపారు. అంతేకాదు చిరంజీవికి, తనకు దూరం కూడా పెంచాడని తెలిపారు. 

56

చిరంజీవికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి సినిమాలు చేసినప్పుడు ఎంతో బాగా చూసుకునేవారు. వ్యక్తిగతంగా చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లతో అప్పుడు మంచి అనుబంధం ఉండేది. కానీ ఈ పెద్ద ఆర్టిస్టు.. తన గురించి లేనిపోని విషయాలను చిరంజీవి వద్ద చెప్పి, తనని బ్యాడ్‌గా క్రియేట్‌ చేసి, దగ్గరికి రానివ్వకండి అంటూ లేని పోని విషయాలను ఆయన వద్ద మోశాడని, గ్యాప్‌ని పెంచాడని శివాజీ వాపోయారు. తనకంటే ఎక్కువగా ఎదిగిపోతున్నాడనే జెలసీ కారణంగా, సక్సెస్‌ కారణంగా అది తట్టుకోలేక తన గురించి బ్యాడ్‌గా చెప్పాడని శివాజీ ఆరోపించారు. 
 

66

మొదట్లో ఎన్టీఆర్‌ కూడా తనతో బాగా ఉండేవారట. `ఆది` సినిమా సమయంలో తమ మధ్య మంచి బాండింగ్‌ ఉండేదని, కానీ పక్కన ఉన్న ఓ పెద్ద ఆర్టిస్ట్ తమ మధ్య గ్యాప్‌ పెంచాడని, అలా, ఇలా అని అనేక విషయాలు మోస్తూ గ్యాప్‌ పెరగడానికి కారణమయ్యాడని తెలిపారు. ఇప్పుడు ఇలాంటివి లేవు కానీ, పెద్ద హీరోలెవరైనా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారని, ఇప్పుడు మంచి పద్ధతి నడుస్తుందని, కానీ ఒకప్పుడు మాత్రం హీరో చుట్టూ ఓ కోటరి ఉండేదని, ఆ బ్యాచ్‌ చుట్టూ చేరి అక్కడి విషయాలు, ఇక్కడి విషయాలు మోస్తూ, చాడీలు చెబుతూ విభేదాలు క్రియేట్‌ చేసేవారని, క్లోజ్‌గా ఉన్నవాళ్లని దూరం చేసేవాళ్లని తెలిపారు. దాని వల్ల తాను చాలా ఇబ్బంది పడినట్టు తెలిపారు శివాజీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories