ఉప్పెన సక్సెస్ తో కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ సైతం సూపర్ హిట్ కొట్టింది. నాని హీరోగా సోషియో ఫాంటసీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కించారు. సాయి పల్లవి మరొక హీరోయిన్ గా నటించింది. బంగార్రాజు మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేసింది.