`ఆర్య` కోసం సూపర్‌ హిట్‌ మూవీని వదిలేసిన అల్లు అర్జున్‌.. రవితేజకది మామూలు జాక్‌ పాట్‌ కాదు..

Published : Jun 04, 2024, 11:00 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇటీవల `ఆర్య` 20ఏళ్ల సెలబ్రేట్‌ చేశారు. కానీ ఈ సినిమా కంటే ముందు తన వద్ద మరో స్క్రిప్ట్ ఉందట. దాని వెనుక కథ చెప్పాడు బన్నీ.   

PREV
15
`ఆర్య` కోసం సూపర్‌ హిట్‌ మూవీని వదిలేసిన అల్లు అర్జున్‌.. రవితేజకది మామూలు జాక్‌ పాట్‌ కాదు..

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అల్లు అర్జున్‌. `గంగోత్రి` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. తొలి మూవీతోనే ఆకట్టుకున్నాడు బన్నీ, కానీ తన మార్క్ మాత్రం కనిపించలేదు. దర్శకేంద్రుడి ప్రభావమే కనిపించింది. 
 

25

అనంతరం అల్లు అర్జున్‌కి సినిమాలు లేవు, ఏ స్క్రిప్ట్ నచ్చడం లేదు. ఆల్మోస్ట్ జీరో పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాకపిచ్చెక్కిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు బన్నీ. ఆ సమయంలో ఓ స్క్రిప్ట్ వచ్చింది. అదే `భద్ర` మూవీ. బోయపాటి శ్రీను ఈ కథని బన్నీకి చెప్పాడట. కానీ అంతగా ఎగ్జైట్‌ కాలేకపోతున్నాడట బన్నీ. చేయాలా? వద్దా అనే డైలమాలో ఉన్నాడు. 

35

 ఇలాంటి కన్‌ఫ్యూజన్‌లో ఉన్న సమయంలో సుకుమార్‌ కలిశాడు. ప్రసాద్‌ ల్యాబ్‌లో సుకుమార్‌ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కథ చెప్పడం, కథకి ఎగ్జైట్‌ కాగా, ఎలాగైనా ఈ స్క్రిప్ట్ చేయాలని తపించారు. కానీ అల్లు అరవింద్‌, దిల్‌రాజు వంటి టీమ్‌కి నమ్మకం కుదరడం లేదు. వినాయక్‌ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో, చిరంజీవి మాటలో రంగంలోకి దిగారు. 

45

అయితే అప్పటికీ `ఆర్య` చేయలా? `భద్ర` చేయాలా అనే డైలమా కూడా కొనసాగిందట. ఎందుకో సుకుమార్‌ స్క్రిప్ట్ బాగా ఎగ్జైట్‌ చేస్తుందని, దీంతో `భద్ర`ని వదులుకున్నాడట బన్నీ. అలా ఆ మూవీ రవితేజ వద్దకు వెళ్లింది. బోయపాటిని పరిచయం చేస్తూ రవితేజ చేసిన `భద్ర` చిత్రం సైతం పెద్ద విజయాన్ని సాధించింది. మాస్‌ మహారాజాకి మాస్‌ హిట్‌ని అందించింది. బన్నీ రిజెక్షన్‌తో రవితేజ జాక్‌ పాట్‌ కొట్టేశాడు. అయితే అప్పటికే వరుస హిట్లతో స్టార్‌ హీరోగా ఉన్నాడు రవితేజ. ఆ సమయంలోనే ఈ మూవీ చేసి అదరగొట్టాడు. మాస్‌ ఇమేజ్‌ని పెంచుకున్నాడు. 

55

మరోవైపు అల్లు అర్జున్‌ `ఆర్య`తోనూ సంచలన విజయాన్ని అందుకున్నాడు. అప్పట్లో ఈమూవీ ట్రెండ్‌ సెట్టర్‌. పాటలు కుర్రకారుని ఓ ఊపు ఊపేశాయి. అయితే బన్నీకి `ఆర్య`నే బెస్ట్ ఛాయిస్‌. `భద్ర` చేసేంత ఏజ్‌ లేదు. మాస్‌ ఇమేజ్‌ లేదు. కాబట్టి ఆ మూవీని వదులుకోవడమే బెటర్‌ ఛాయిస్‌ అని అభిమానులు, క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బన్నీ `పుష్ప 2`లో నటిస్తున్నారు. ఇది ఆగస్ట్ 15న విడుదల కాబోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories