తల్లి కాబోతోన్న కియారా అద్వాని... బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్...

Published : Jun 27, 2023, 02:41 PM IST

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని తల్లి కాబోతోందా...? బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాలలో నిజం ఎంత..? ఈ విషయంపై స్టార్ హీరోయిన్ స్పందించిందా..? 

PREV
16
తల్లి కాబోతోన్న కియారా అద్వాని... బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్...
Kiara Advani

బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ తల్లి కాబోతుందంటూ.. బాలీవుడో మీడియా కోడై కూస్తోంది. పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలు..షూటింగ్స్ తో బిజీ  బిజీగా గడిపేస్తోన్న కియారా..  ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ జంటగా  సత్యప్రేమ్‌ కీ కథా సినిమాలో నటించింది. ఈ మూవీ  ప్రమోషన్లు జోరుగా చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమ ప్రమోషన్‌లో భాగంగా జైపూర్‌లో హీరో  కార్తిక్‌ ఆర్యన్ తో  కలిసి సందడి చేసింది కియారా అద్వాని. 
 

26

కియారా అద్వాని  సత్యప్రేమ్‌ కీ కథా సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జైపూర్‌లో కార్తిక్‌తో కలిసి ఈ బ్యూటీ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఫోటోలలో కియారా నార్మల్ గా లేనట్టు అనినిపించింది. మరీ ముఖ్యంగా  బేబి బంప్‌తో ఆమె  ఉన్నట్లు కనిపించింది. దాంతో పలువురు నెటిజన్లు ఏదైనా శుభవార్త ఉందా కియారా జీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 
 

36
Image: Instagram

అయితే అసలు విషయంలో మాత్రం క్లారిటీ లేదు.  నిజంగానే కియారా ప్రెగ్నెంట్‌ అయిందా? లేదంటే ఆమె వేసుకున్న డ్రెస్‌ వల్ల అలాగా కనిపించిందా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు జనాలు. అటు నెటిజన్లు మాత్రం వదిలిపెట్టకుండా కియారాకు శుభాకాంక్షలు తెలపుతునూనే ఉన్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 
 

46

అయితే ఈ విషయంల  కొందరు మాత్రం కియారా వేసుకున్న డ్రెస్‌ వల్లే అలా కనిపిస్తుంది.. బేబి బంప్ మాత్రం కాదు అంటున్నారు.  ఒకవేళ నిజంగానే ఆమె ప్రెగ్నెంట్‌ అయితే.. ఆ గుడ్ న్యూస్ ఎందుకు దాస్తుంది.. ప్యాన్స్ కు చెప్పకుండా ఉంటుందా అని కామెంట్ చేస్తున్నారు. ఇక కియారా బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ సినిమాతో పాటు టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జోడీగా గేమ్ చేంజర్ లో నటిస్తోంది. 

56

ఇక కియారా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె ప్రియుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాను ఘనంగా వివాహం చేసుకుంది. జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. వీరిద్దరు దాదాపు ఇటీవలే వెకేషన్‌ పూర్తి చేసుకుని వచ్చిన ఈ జంట ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. అయితే వీరిద్దరు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాని ఈ విషయం ఎప్పుడు అడిగినా.. సమాధానం చెప్పకుండా.. దొరకిపోకుండా ఉండాలని ప్రయత్నించారు. ఎట్టకేళకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 

66

ఇక కియారా అద్వాని నటించిన సత్యప్రేమ్‌ కీ కథ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి. ఇప్పటివరక రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. మరోవైపు ప్రమోషన్‌లు కూడా ఫుల్ స్వింగ్‌లో చేస్తుండటంతో హిందీ ప్రేక్షకుల్లో మంచి హైపే ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories