పెళ్లి పీఠలెక్కబోతున్న ఐశ్వర్య అర్జున్, మరి వరుడు ఎవరంటే..?

First Published | Jun 27, 2023, 11:27 AM IST

సౌత్ సీనియర్ హీరో అర్జున్ సర్జా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో ఆయన కూతురు.. హీరోయిన్ ఐశ్వర్య సర్జా పెళ్ళి జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ పెల్లి కొడుకు ఎవరంటే..? 

సౌత్ సీనియర్  హీరో..  యాక్షన్ కింగ్ అర్జున్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడనాట హీరోగా స్టార్ట్ అయ్యి.. తమిళ నాట స్టార్ డమ్ సాధించి.. కోలీవుడ్ హీరోగా చెన్నైలో సెటిల్ అయ్యారు అర్జున్ సర్జా. తెలుగు తమిళ కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి..  ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అర్జున్. ఇప్పటికీ.. సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ.. అలరిస్తున్నాడు అర్జున్. 

అటు హీరో.. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటున్నాడు అర్జున్.  ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా.. ఆయన వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. హీయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది.ఇకపోతే తాజాగా అర్జున్ కుమార్తె నటి ఐశ్వర్యకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది.అ


ఇప్పటికే ఈమె కన్నడ, తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది ఐశ్వర్య అర్జున్. హీరోయిన్ గా మంచి గుర్తింపుకోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆమధ్య తెలుగులో కూడా హీరోయిన్ గా ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఈసినిమాలో హీరోగా విశ్వక్ సేన్ ను తీసుకున్నారు. ఆతరువాత అర్జున్ టీమ్ కు.. విశ్వక్ కు క్రీయేటీవ్ డిఫరెన్స్ లు రావడంతో.. ఈసినిమా నుంచి యంగ్ హీరో తప్పుకున్నాడు. 

arjun

కొన్ని కారణాల వల్ల విశ్వక్ సేన్ తప్పుకోవడంతో..  ఈ సినిమా ఆగిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా  ఐశ్వర్య పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యాక్తితో ఆమె పెళ్ళి జరగబోతుందట. 

Aishwarya Arjun Sarja Umapathy Ramaiah

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెంది యంగ్ స్టార్ తో ఐశ్వర్య పెళ్లి జరగబోతున్నట్టు..  కోలీవుడ్ సర్కిల్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఈమె పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఐశ్వర్య ఉమాపతితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం.

Aishwarya

తంబి రామయ్య తనయుడు  ఉపాపతి కూడా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాలు టీవీ షో లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఉమాపతితో ఐశ్వర్య వివాహం జరగబోతుందన్న వార్త సంచలనంగా మారింది. కాని ఇంత వరకూ ఈ విషయంలో ఇరు ఫ్యామిలీలు స్పందించలేదు. 

అయితే చెన్నై సర్కిల్ లో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజం ఎంతా అనేది తెలియాలి అంటే.. అటు అర్జున్ కాని.. ఇటు తంబిరామయ్య ఫ్యామిలీ నుంచి ఎవరైన ప్రకటిస్తే.. అసలు విషయం తెలుస్తుంది. మరి చెపుతారా..? లేక సైలెంట్ గా పెళ్లి జరిపిస్తారా అనేది చూడాలి. 

Latest Videos

click me!