Keerthy Suresh: కేరళలో తేలిన కళావతి... ప్రీ వెడ్డింగ్ బ్యాష్ అంటూ షాకిచ్చిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్!

Published : Jun 13, 2022, 12:25 PM IST

కీర్తి సురేష్ సడన్ గా కేరళలో ప్రత్యక్షమయ్యారు. సొంతూరు వెళ్లిన ఈ స్టార్ లేడీ స్నేహితులు, బంధు మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. కీర్తి సురేష్ కేరళ వెళ్లడం వెనుక ఓ కారణం ఉంది.   

PREV
18
Keerthy Suresh: కేరళలో తేలిన కళావతి... ప్రీ వెడ్డింగ్ బ్యాష్ అంటూ షాకిచ్చిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్!
Keerthy Suresh

తన కుటుంబ సభ్యులు లేదా మిత్రులకు సంబంధించిన వివాహ వేడుక ఉంది. ఈ వేడుకకు కీర్తి సురేష్ (Keerthy Suresh)స్వయంగా హాజరయ్యారు. ఇక పెళ్లి వేడుకకు వచ్చిన బంధు మిత్రులతో కీర్తి కేరళలో వివహరించారు. ఈ వేడుకలలో మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి కూడా జాయిన్ అయ్యారు. కీర్తి కేరళ ట్రిప్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

28
Keerthy Suresh

ఇక వరుస పరాజయాలతో డీలాపడ్డ కీర్తి సురేష్ సర్కారు వారి పాట (Sarkaru vaari paata)చిత్రంతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్(Mahesh Babu) హీరోగా విడుదలైన సర్కారు వారి పాట భారీ వసూళ్లు రాబట్టింది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సర్కారు వారి పాట ఈ రేంజ్ వసూళ్లు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. 
 

38
Keerthy Suresh

మహానటి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ ఆమెకు మరలా దక్కలేదు. నితిన్ తో చేసిన రంగ్ దే అనుకున్నంత విజయం సాధించలేదు. ఆమె లేటెస్ట్ మూవీ గుడ్ లక్ సఖి సైతం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన గుడ్ లక్ సఖి మూవీలో విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు.

48
Keerthy Suresh


అయితే కీర్తి సురేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. పల్లెటూరి అమ్మాయి పాత్రలో రెండు భిన్నమైన షేడ్స్ లో నటించి మెప్పించారు. షూటర్ గా ఆమె నటన చాలా సహజంగా సాగింది.మహానటి మూవీ కీర్తి సురేష్ ఫేట్ మార్చేసింది. ఆ మూవీతో వచ్చిన క్రేజ్ తో ఆమెకు వరుసగా సినిమాలు వస్తున్నాయి.

58
Keerthy Suresh

చిరంజీవి(Chiranjeevi)-మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె చిరంజీవి సిస్టర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా భారీ ప్రాజెక్ట్ అయినప్పటికీ చెల్లిగా చేస్తున్న నేపథ్యంలో ఆమె కెరీర్ కి అంతగా ఉపయోగపడకపోవచ్చు.

68
Keerthy Suresh


స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉండి కూడా కీర్తి సిస్టర్ రోల్స్ చేయడం కొసమెరుపు. రజనీ కాంత్ లేటెస్ట్ హిట్ అన్నాత్తేలో కీర్తి సురేష్ సిస్టర్ రోల్ చేసిన విషయం తెలిసిందే. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ మూవీలో తెలుగులో మాత్రం పరాజయం పొందింది. ప్రస్తుతానికి కీర్తి కెరీర్ కి మాత్రం ఢోకా లేదు. భోళా శంకర్ తో పాటు తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో మరో చిత్రం చేస్తున్నారు. 
 

78
Keerthy Suresh


ఇటీవల నానికి జంటగా మరో చిత్రం ప్రకటించారు. దసరా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. నాని పూర్తి మాస్ డీగ్లామర్ రోల్ చేస్తుండగా పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

88
Keerthy Suresh

తన కుటుంబ సభ్యులు లేదా మిత్రులకు సంబంధించిన వివాహ వేడుక ఉంది. ఈ వేడుకకు కీర్తి సురేష్ (Keerthy Suresh)స్వయంగా హాజరయ్యారు. ఇక పెళ్లి వేడుకకు వచ్చిన బంధు మిత్రులతో కీర్తి కేరళలో వివహరించారు. ఈ వేడుకలలో మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి కూడా జాయిన్ అయ్యారు. కీర్తి కేరళ ట్రిప్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

click me!

Recommended Stories