Kajal Aggarwal: లావై పోతున్న కాజల్... చందమామ లేటెస్ట్ లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!

Published : Dec 13, 2022, 02:23 PM IST

నెలవంక చంద్రుడిలా ఉండే కాజల్ అగర్వాల్ లేటెస్ట్ లుక్ షాక్ ఇస్తుంది. స్టార్ లేడీ బరువు పెరిగినట్లు తెలుస్తుంది. ఆమె శ్రద్ద తీసుకోకపోతే షేప్ అవుట్ అవుతారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.   

PREV
18
Kajal Aggarwal: లావై పోతున్న కాజల్... చందమామ లేటెస్ట్ లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్!
kajal aggarwal

ఆడవాళ్ళ శరీరం చాలా సున్నితం. తక్కువ కాలంలో మార్పులకు గురవుతుంది. మోడరన్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఊబకాయానికి కారణం అవుతున్నాయి. ఇక పెళ్ళై, పిల్లలు పుట్టాక స్లిమ్ బాడీ మైంటైన్ చేయడం మామూలు విషయం కాదు. 
 

28
kajal aggarwal


కాజల్ ఇప్పుడు అదే సమస్య ఎదుర్కొంటున్నారు. 2020 లో వివాహం చేసుకున్న కాజల్ ఈ ఏడాది తల్లి అయ్యారు. ఆమె పండంటి అబ్బాయికి జన్మనిచ్చారు. గౌతమ్ కిచ్లు అని పేరు పెట్టారు. ఈ క్రమంలో కాజల్ కొన్నాళ్ళు సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. 
 

38
kajal aggarwal


తల్లి అయ్యాక కాజల్ బరువు పెరుగుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఆమె లేటెస్ట్ లుక్ షాక్ ఇస్తుంది. కాజల్ లావైనట్లు కొట్టిచ్చినట్లు కనబడుతుంది. దీంతో మేడమ్ మీరు స్లిమ్ అవ్వాలి. మునుపటి కాజల్ లా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు చేయాలని కామెంట్ చేస్తున్నారు. 
 

48
kajal aggarwal

జీవితంలో తల్లితనం అన్నింటికంటే ముఖ్యం. కాబట్టి బరువు పెరిగినందుకు కాజల్ బాధపడాల్సిన అవసరం లేదు. అందులోనూ హీరోయిన్ గా ఆమె కెరీర్లో హైట్స్ చూశారు. కొత్తగా ఆమె సాధించాల్సింది ఏమీ లేదు. 


 

58
kajal aggarwal

కాగా కెరీర్, పర్సనల్ లైఫ్ రెంటినీ కాజల్(Kajal Aggarwal) పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేస్తున్నారుకొడుకు నీల్ కిచ్లు ఆలనా పాలన చూసుకుంటూ మాతృత్వపు అనుభూతి పొందుతుంది. సక్సెస్ వెనుకపడుతూ ఫ్యామిలీ లైఫ్ కి దూరమయ్యే హీరోయిన్స్ కాజల్ ని చూసి చాలా నేర్చుకోవాలి. ప్రొఫెషన్ లో కొనసాగుతూ కూడా ఎలా కుటుంబ విలువలు, సాంప్రదాయాలు పాటించవచ్చో కాజల్ నిరూపించింది.
 

68


ప్రస్తుతం కాజల్ భారతీయుడు 2(Bharateeyudu 2) షూటింగ్ లో పాల్గొంటున్నారు. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. వివాదాల కారణంగా భారతీయుడు 2 చిత్రీకరణ మధ్యలో ఆగిపోయింది. కమల్ హాసన్(Kamal Haasan) విక్రమ్ సక్సెస్ నేపథ్యంలో తిరిగి షూట్ ప్రారంభించారు.

78
Kajal Aggarwal


భారతీయుడు 2 లో కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రకుల్ మరో హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం. భారతీయుడు 2 తో పాటు రెండు తమిళ, ఒక హిందీ చిత్రంలో కాజల్ నటిస్తున్నారు. హీరోయిన్ గా ఆమె వరుస ఆఫర్స్ పట్టేస్తున్నారు.

88
kajal aggarwal

మరోవైపు భర్తకు వ్యాపారంలో తన వంతు సహాయం చేస్తుంది. గౌతమ్ కిచ్లు ఓ ఫర్నిచర్ సంస్థ కలిగి ఉన్నాడు. ఈ సంస్థ ఉత్పత్తులకు కాజల్ ప్రచారం కల్పిస్తున్నారు. తన ఇమేజ్ ఉపయోగించి వ్యాపారం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు.

 

click me!

Recommended Stories