ఇక హన్సిక ‘దేశముదురు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడంతో పాటు తన ఫిల్మ్ కేరీర్ నూ ప్రారంభించింది. అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసిన హన్సిక ఈ తొలిచిత్రంతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. నటన, అందం, డాన్స్ లో అదరగొట్టింది. ప్రేక్షకుల నుంచి అన్నివిధాలా నూటికి నూరు మార్కులు పొందింది. పెళ్లి తర్వాత కూడా కేరీర్ లో జోరు కనబరుస్తోంది. ప్రస్తుతం ఐదారు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషలో ఆ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. రీసెంట్ గా ‘మహ’తో అలరించింది.