విదేశాల్లో రాశీ ఖన్నా రచ్చ.. ట్రెండీ వేర్స్ లో అట్రాక్ట్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. స్టైలిష్ లుక్స్ వైరల్

First Published | Mar 17, 2023, 5:18 PM IST

స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) ప్రస్తుతం విదేశాల్లో వేకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడి నుంచి స్టన్నింగ్ స్టిల్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంది. లేటెస్ట్ రాశీ షేర్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా ప్రస్తుతం సక్సెస్ జోరు మీద ఉంది. టాలీవుడ్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్ లో సందడి చేస్తోంది. అక్కడే అవకాశాలను అందుకుంటోంది. 
 

సినిమాలే కాకుండా.. సిరీస్ లలోనూ నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో రీసెంట్ గా హిందీలో వచ్చిన ‘ఫర్జీ’ Farziతో రాశీ ఖన్నా తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఆర్బీఐ ఆఫీసర్ గా అలరించింది. మరోవైపు బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ కట్టిపడేసింది.
 


సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన నటించిన రాశీ ఖన్నా..ఏకంగా లిప్ లాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అవకాశాల కోసం రూటు మార్చినట్టుగా కనిపిస్తోంది. ఒకప్పుడు ట్రెడిషనల్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం గ్లామర్ షోకు తెర తీసినట్టు కనిపిస్తోంది. 
 

ఈ సందర్భంగా రాశీ ఖన్నా సోషల్ మీడియాలో పంచుకుంటున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉంటున్నాయి. అదిరిపోయే అవుట్ ఫిట్లలో యంగ్ బ్యూటీ అందాల విందు చేస్తోంది. గ్లామర్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న రాశీఖన్నా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంది.
 

వేకేషన్ లో భాగంగా రాశీఖన్నా పారిస్ లో మెరిసింది. తాజాగా నెదర్లాండ్స్ లో వేకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా స్టైలిష్ లుక్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. సిటీ వ్యూ గల  బ్యూటీఫుల్ లోకేషన్ లో రాశీ స్టన్నింగ్ స్టిల్ ఆకట్టుకుంటోంది.
 

రెడ్ జాకెట్,బ్లాక్ జీన్స్, షూస్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. సన్ గ్లాసెస్ ధరించి అదిరిపోయే పోజుతో అట్రాక్ట్ చేసింది. నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డ్యామ్ వద్ద ఉన్నట్టు తెలిపింది. ఇలా విదేశీ పర్యటనలో ఎంజాయ్ చేస్తున్న రాశీ ఖన్నా ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అప్డేట్ అందిస్తోంది. ప్రస్తుతం రాశీ హిందీలోని ‘యోదా’ చిత్రంలో నటిస్తోంది.
 

Latest Videos

click me!