తాజాగా ఫరియా ట్రాన్సపరెంట్ డ్రెస్ లో పరువాలు చూపిస్తూ రెచ్చగొట్టింది. అమ్మడు చురుకైన చూపులు నేరుగా గుండెలను తాకుతున్నాయి. ఫరియా బోల్డ్ లుక్ మెస్మరైజ్ చేస్తుండగా కామెంట్ చేయకుండా ఉండలేకున్నారు.
27
Faria Abdullah
ఫరియా మంచి డాన్సర్. చక్కని రూపం కలిగిన పొడుగు సుందరి. అయితే ఇంకా బ్రేక్ రాలేదు. జాతి రత్నాలు చిత్రం భారీ విజయం సాధించినప్పటికీ తర్వాత ఆమెకు మరో హిట్ పడలేదు. హీరోయిన్ గా సోలో ఆఫర్స్ రావడం లేదు.
37
Faria Abdullah
హైదరాబాద్ భామ ఫరియాకు అనుదీప్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు చిత్రంతో ఫరియా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేయగా ఫరియా హీరోయిన్ రోల్ చేశారు.
47
Faria Abdullah
జాతిరత్నాలు భారీ విజయం సాధించింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ కాసులు కురిపించింది. చిట్టి పాత్రలో ఫరియా ఒదిగిపోయి నటించింది. ఇన్నోసెంట్ లాయర్ గా, లవర్ గా నవ్వులు పూయించింది. జాతిరత్నాలు ఫరియాను ఓవర్ నైట్ స్టార్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఆ మూవీ విజయం సాధించిన స్థాయిలో ఆఫర్స్ అయితే రావడం లేదు.
57
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో ఫరియా చిన్న క్యామియో రోల్ చేశారు. హీరో పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అమ్మాయి పాత్రలో తళుక్కున మెరిశారు. అనంతరం బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేశారు. సంతోష్ శోభన్ కి జంటగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కనీస ఆదరణ దక్కించుకోలేదు.
67
ఫరియా హీరోయిన్ గా రావణాసుర చిత్రంలో నటించారు. రవితేజ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నిరాశపరిచింది. ఈ మూవీపై ఫరియా చాలా ఆశలే పెట్టుకున్నారు.
77
ప్రస్తుతం ఫరియా చేతిలో ఓ చిత్రం ఉంది. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. సోషల్ మీడియా వేదికగా తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఫరియా డాన్స్ వీడియోలకు భలే డిమాండ్ ఉంది. అలాగే బోల్డ్ ఫోటో షూట్స్ కి వెనుకాడటం లేదు.