యంగ్ గా మారుతున్న సీనియర్ నటి రమ్యకృష్ణ.. అదిరిపోయే అవుట్ ఫిట్ లో శివగామీ మెరుపులు

First Published | Aug 1, 2023, 1:42 PM IST

సీనియర్ నటి రమ్యకృష్ణ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. సెకండ్ ఇన్సింగ్స్ లోనూ దుమ్ములేపుతున్న సీనియర్ భామ మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్లలోనూ మెరుస్తూ నెట్టింట సందడి చేస్తోంది. 
 

కొన్నేండ్ల పాటు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రమ్యకృష్ణ (Ramya Krishnan) ఊపూపింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన వందల సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. 
 

ముఖ్యంగా రమ్యకృష్ణ ‘బాహుబలి’ చిత్రం తర్వాత మరింత క్రేజ్ ను దక్కించుకుంది. ఆమె సెకండ్ ఇన్నింగ్ కేరీర్ కు ఈ చిత్రం ఎంతగానో ఉపయోగపడింది. మరోవైపు ‘శివగామీ’ పాత్రలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆమెపై సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. 
 


ఇప్పటికీ రమ్యకృష్ణ భారీ ప్రాజెక్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది. సీనియర్ స్టార్స్ సరసన నటిస్తోంది. ప్రస్తుతం ఆమె రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో నటిస్తోంది. 24 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ పేయిర్ వెండితెరపై అలరించబోతోంది. రీసెంట్ గా ‘జైలర్’ ఆడియో లాంచ్ కూడా గ్రాండ్ గా జరిగింది. 

ఈవెంట్ లో రమ్యకృష్ణ ట్రెండీ వేర్ లో మెరిసింది. ఐదు పదుల వయస్సులోనూ యంగ్ గా కనిపించింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా కిర్రాక్ గా ఫొటోషూట్ చేసింది. మతులుపోయేలా ఫోజులిచ్చి ఆకట్టుకుంది. రమ్యకృష్ణ ఫోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

రానురాను మరింత యంగ్ గా మారుతున్న రమ్యకృష్ణ అందాన్ని పొగుడుతూ  ఆకాశానికి ఎత్తుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ భారీ చిత్రాల్లో అలరిస్తున్న లేడీ సూపర్ స్టార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘జైలర్‘తో పాటు మరిన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది. 
 

తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’లోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘జైలర్’ మాత్రం ఆగస్టు 10న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. 

Latest Videos

click me!