హైదరాబాద్ కి చెందిన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ కావాలనే ఆశతో మోడలింగ్ చేశారు. యంగ్ డైరెక్టర్ అనుదీప్ ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు చిత్రంతో ఫరియా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేయగా ఫరియా హీరోయిన్ రోల్ చేశారు.