పూలు, పండ్లు వేయలేదని హీరోయిన్‌ ఫ్యాన్స్ గొడవ.. రాఘవేంద్రరావు `బీఏ` అసలైన అర్థం అదేనా, డిగ్రీ కాదు!

First Published | Oct 11, 2024, 11:16 PM IST

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన సినిమా పాటల్లో చాలా వరకు హీరోయిన్లపై పూలు, పండ్లు వేస్తుంటారు. అయితే ఓ హీరోయిన్‌పై వేయనందుకు పెద్ద గొడవ అయ్యిందట. 

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనది ప్రత్యేక స్థానం. తెలుగు సినిమాని కమర్షియల్‌ బాట పట్టించిన దర్శకుడు. గ్లామర్ కి కొత్త అర్థం చెప్పిన దర్శకుడు. రొమాన్స్ ని సరికొత్తగా చూపించిన దర్శకుడు. అందుకే ఆయన చాలా ప్రత్యేకం. ముఖ్యంగా రాఘవేంద్రరావు సినిమాల్లో పాటలకు విశేషమైన క్రేజ్‌ ఉంటుంది.

వాటి కోసమే సినిమాలు చూసే ఆడియెన్స్ ఉండేవాళ్లు. సినిమాలో కథ ఉందా? సినిమా బాగుందా? లేదా అనే దాన్ని కూడా పట్టించుకోకుండా, పాటలున్నాయా? అందులో హీరోయిన్‌పై పూలు, పండ్లు వేశారా? అలాంటి సీన్లు ఉన్నాయా? అని చూసుకుని సినిమాకి వెళ్లే ఆడియెన్స్ ఉన్నారు. వాటికోసమే సినిమాలు చూసే ఫ్యాన్స్ ఉండేవాళ్లు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ప్రారంభంలో ఇరవై, మూప్పై సినిమాల వరకు ఆయన ఇలా పూలు, పండ్లు వేయలేదు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రారంభించారు. హీరోయిన్ల అందాన్ని పూలు, పండ్లతో అభిషేకం చేయాలనేది, అంతటి గొప్పది అందం అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సినిమాల్లో డైరెక్ట్ ముద్దులు, లిప్‌ లాక్‌లు, ఇంకా బెడ్‌ సీన్లు, రొమాన్స్ సీన్లు కూడా డైరెక్ట్ గానే చూపిస్తున్నారు.

కానీ అప్పుడు హీరోహీరోయిన్ల రొమాన్స్ ని ఇలా పూలు, పండ్లతో చూపించేవారు. ముద్దు పెట్టుకోవాల్సి వస్తే, పండుకో, పువ్వుకో పెట్టడం, లేదంటే హీరోహీరోయిన్ల మధ్య లిప్‌ను పండ్లతో కవర్‌ చేయడం చేసేవాళ్లు. అప్పట్లో అదే పెద్ద రొమాన్స్. దాన్నే పొయేటిక్‌ రొమాన్స్‌ అంటారు. అందుకే దానికి చాలా క్రేజ్‌. ఇప్పటికీ ఆ రొమాన్స్ ని ఎంజాయ్‌ చేసే ఆడియెన్స్ ఉన్నారు. అలా ఎవర్‌ గ్రీన్‌ రొమాన్స్ గా నిలిచింది.
 


అయితే అప్పట్లో హీరోయిన్లపై పూలు, పండ్లు వేయడమనేది చాలా స్పెషల్‌ గా భావించేవాళ్లట. అలా వేయాలని అంతా కోరుకునేవాళ్లట. ఆడియెన్స్ నుంచి కూడా డిమాండ్‌ ఉండేదట. అంతేకాదు హీరోయిన్లు కూడా తమపై ఇలా పూలు, పండ్లు వేయించుకోవడానికి పోటీ పడేవాళ్లట. అలా వేస్తేనే వాళ్లు అందగత్తెలుగా భావించేవాళ్లట.

వేయకపోతే అందంగా లేరా? అనే భావన కూడా ఉండేదట. అయితే ఓ సందర్భంలో జరిగిన సంఘటన గురించి చెప్పాడు దర్శకుడు కె రాఘవేంద్రరావు. పూలుపండ్లు వేయడమనే చాలా పీక్‌లోకి వెళ్లిందని, అలా వేయకపోతే చాలా మంది ఫీల్‌ అయ్యేవాళ్లని తెలిపారు. 
 

ఓ సందర్భంలో ఓ హీరోయిన్‌ కి ఇలా పూలు, పండ్లు వేయలేదు. దీంతో ఆమె బాగా ఫీలయ్యింది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఒక హీరోయిన్‌పై అలాంటి పాట ఉంది. వేయాల్సి వచ్చింది. వేశాను, కానీ మరో హీరోయిన్‌కి ఆ ఛాన్స్ రాలేదు. పూలు, పండ్లు వేయడం కుదరలేదు. దీంతో ఆ హీరోయిన్‌ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయిపోయారు. పెద్ద రచ్చ చేశారు.

ఏకంగా నాకు లెటర్లు పంపించి ఎందుకు మా హీరోయిన్‌ పై పూలు, పండ్లు వేయలేదని నిలదీశారట. మా హీరోయిన్‌కి ఏం తక్కువ అని వాళ్లు మండిపడుతూ ఈ లెటర్స్ పంపించారట. సో ఇలా అది  ఏ రేంజ్‌లో జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు రాఘవేంద్రరావు. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే టాక్‌ షోలో ఈ విషయాన్ని చెప్పారు రాఘవేంద్రరావు. 
 

అదే సమయంలో మరో క్రేజీ సీక్రెట్‌ని బయటపెట్టాడు. దర్శకుడు తన పేరతోపాటు `బీఏ` అని పెట్టుకున్నాడు. సినిమా టైటిల్స్ లో అదే ఉంటుంది. పోస్టర్లలోనూ ఉంటుంది. అయితే అది తన ఎడ్యూకేషన్‌ క్వాలిఫీకేషన్‌ అనేది తెలిసిందే. కానీ దానికి మరో అర్థం ఉందట.

బీఏ అంటే బొడ్డు మీద యాపిల్‌ అని భావించేవాళ్లని, అలానే ప్రచారం జరిగిందన్నారు. తన సినిమాల్లో బొడ్డుపై పండ్లు వేయడం, ముఖ్యంగా యాపిల్స్ వేసిన సందర్బాలు ఎక్కువగా ఉన్ననేపథ్యంలో ఫ్యాన్స్, సినీ వర్గాలు తనుకు అలాంటి పేరు పెట్టారని తెలిపారు దర్శకుడు.  

రాఘవేంద్రరావు దాదాపు ఐదు దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉంటున్నారు. తండ్రి ప్రముఖ దర్శకుడు కె ప్రకాష్‌రావు వద్ద అసిస్టెంట్‌గా పనిచేసి ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ఇప్పటి వరకు ఆయన 110 సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సీరియల్స్ కూడా రూపొందించారు. టీవీ షోస్‌, యాడ్స్ ఇలా చాలా చేశారు. 

దర్శకరత్న దాసరి నారాయణరావు తర్వాత అత్యధిక సినిమాలు రూపొందించిన దర్శకుడిగా కె రాఘవేంద్రరావు నిలవడం విశేషం. దర్శకుడిగా దాదాపు అందరు హీరోలతో చేశారు. ఎంతో మందికి హిట్లు ఇచ్చి స్టార్లని చేశారు. ఇప్పుడు సీరియల్స్ నిర్మించడంతోపాటు తన దర్శకత్వ పర్యవేక్షణలో సినిమాలు చేస్తున్నారు రాఘవేంద్రరావు. చివరగా ఆయన నాగార్జున, అనుష్కలతో `ఓం నమో వెంకటేశాయ` సినిమా చేశారు. ఇది ఆడలేదు. దీంతో దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు దర్శకేంద్రుడు. 
 

Latest Videos

click me!