Published : Jul 15, 2023, 03:21 PM ISTUpdated : Jul 15, 2023, 03:22 PM IST
ఓరుగల్లు భామ ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటో షూట్ తో వచ్చేశారు. కోట్, ప్యాంట్స్ ధరించి కార్పొరేట్ లుక్ లో కేకపుట్టింది. అయితే బ్యాక్ గ్రౌండ్ కి ఆమె డ్రెస్ కి సింక్ కాలేదు.
కొబ్బరి తోటలో సూపర్ స్టైలిష్ గా మెరిసింది ఈషా రెబ్బా. తెలుగు పిల్ల ఈషా లుక్ కిక్ ఇచ్చేదిగా ఉంది. అమ్మడు గ్లామర్ గుండెల్లో దడ పుట్టిస్తుంది. నెటిజెన్స్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
29
Eesha Rebba
ఈషా అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. ఈషా దయా టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. దయా ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఆకట్టుకుంది. దర్శకుడు పవన్ సాధినేని దయా సిరీస్ తెరకెక్కించారు. త్వరలో హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.
39
Eesha Rebba
ఇటీవల ఓ తమిళ ప్రాజెక్ట్ ప్రకటించారు. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది.
49
Eesha Rebba
2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అభిజీత్ హీరోగా నటించాడు. హ్యాపీ డేస్ సక్సెస్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ మూవీ ఆ స్థాయిలో ఆడలేదు.
59
Eesha Rebba
అనంతరం అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో మెయిన్ లీడ్ చేసింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా అంతకు ముందు ఆ తర్వాత చిత్రం తెరకెక్కింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు.
69
Eesha Rebba
ఈ క్రమంలో బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషాకు భారీ కమర్షియల్ హిట్ పడకపోవడం మైనస్ అయ్యింది.ప్రస్తుతం ఈషాకు తెలుగులో ఫేమ్ తగ్గింది. దీంతో పర భాషల్లో సక్సెస్ కావాలని చూస్తున్నారు.
79
Eesha Rebba
కట్టిపడేసే అందం, నటన ఉండి కూడా లక్ అనేది ఈషాకు చిక్కలేదు. అందుకే ఆమె రేసులో వెనుకబడిపోయింది. దీనికి వివక్ష కూడా ఒక కారణం. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి బాలీవుడ్ భామలను తెచ్చుకుంటారు కానీ లోకల్ టాలెంట్ ని గుర్తించరు.
89
Eesha Rebba
ఇదే విషయాన్ని ఈషా రెబ్బా ఇటీవల కుండబద్దలు కొట్టారు. తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఆఫర్స్ ఇవ్వడం లేదని వాపోయారు. వేరే పరిశ్రమల్లో టాలీవుడ్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే గర్వంగా ఉంటుంది. కానీ తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశం ఇవ్వరంటూ ఓపెన్ అయ్యారు. ఈషా రెబ్బా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
99
Eesha Rebba
ఓరుగల్లు భామ ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటో షూట్ తో వచ్చేశారు. కోట్, ప్యాంట్స్ ధరించి కార్పొరేట్ లుక్ లో కేకపుట్టింది. అయితే బ్యాక్ గ్రౌండ్ కి ఆమె డ్రెస్ కి సింక్ కాలేదు.